Magazines

డోజర్లతో అక్రమ ఇసుక దందా.!

8 గంటల క్రితం

DROZAR
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 1 నిమిషాల చదవడం

కూలీల పొట్ట కొడుతున్న ట్రాక్టర్ యజమానులు

పట్టించుకోని రెవిన్యూ పోలీస్ యంత్రాంగం

నవతెలంగాణ-మల్హర్ రావు

కాటారం, మల్హర్ రావు మండలాల్లోని విలాసాగర్, దామరకుంట, గంగారం, వల్లెంకుంట, తాడిచెర్ల, మల్లారం గ్రామాల్లోని మానేరు పరివాహక ప్రాంతాల నుండి వివిధ గ్రామాలకు ఇందిరమ్మ ఇండ్లకు ప్రభుత్వ భవనాలకు, కాటారం, భూపాలపల్లి పట్టణాల్లో విక్రయించడానికి ఇసుక ట్రాక్టర్ల యజమానులు కూలీలతో కాకుండా డోజర్లతో అడ్డుఅదుపు లేకుండా తవ్వకాలకు పాల్పడి నిరుపేద కూలీల పొట్టను కొడుతున్నారని, పోలీస్, రెవెన్యూ, మైనింగ్ అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు.


గ్రామాల్లో ప్రజలకు ఉపాధి మార్గాలను కల్పించడానికి ఇసుకను ట్రాక్టర్లో లోడ్ చేయడానికి ఆ గ్రామంలోని ప్రజలే లోడింగ్ చేయాలని డోజర్లను వాడకూడదని ఇసుక ట్రాక్టర్ల యజమానులతో పోలీసు వారు, రెవిన్యూ వారు, గ్రామంలోని పెద్దలు ప్రజలు  చెప్పినప్పటికీ అధికారుల మాటలను ఏమాత్రం లెక్క చేయకుండా ట్రాక్టర్ యజమానులు డోజర్ల సహాయంతో ఇసుకను లోడింగ్ చేసి పేద ప్రజల పొట్ట మీద కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దసరా పండుగ వేళ గ్రామంలోని నిరుపేద కూలీలకు పండుగ ఖర్చులైనా సమకూర్చుకోవచ్చనని ఆలోచనతో ఉన్న కుటుంబాలు రోడ్డుమీద పడే పరిస్థితికి రావడం జరిగిందని చెబుతున్నారు. ఇప్పటికైనా రెవిన్యూ, పోలీస్ అధికారులు పట్టించుకోని ట్రాక్టర్లల్లో లోడింగ్ను అక్కడ ఉన్న ప్రజల తోటి చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని కూలీలు కోరుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్