నవతెలంగాణ-మల్హర్ రావు
మండలం ఎడ్లపల్లి గ్రామానికి చెందిన జనగామ సాయి లోహిత్ మణికొండ వర్ధన్నపేటలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు.వాలీబాల్ పోటీల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో గెలుపొంది రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపికై ప్రతిభ చాటినట్లుగా ఎస్జిఏప్ఐ వరంగల్ జిల్లా కార్యదర్శి శ్రీదర్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు సోమవారం హన్మకొండ జెఎన్ఎస్ స్టేడియంలో నిర్వహించిన వరంగల్ జిల్లా స్థాయి ఎస్జిఏప్ఐ అండర్ యు-19 వాలీబాల్ పోటీల్లో గెలుపొంది రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లుగా తెలిపారు.ఇందుకు లోహిత్ ను తల్లిదండ్రులు,అధ్యాపకులు అభినందించారు.రాష్ట్ర,జాతీయ స్థాయిలో మరింత ప్రతిభ కనబరిచి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.







కామెంట్లు (0)