అదే తండాకు చెందిన వ్యక్తి దొంగలించిన వైనం
దొంగలను పట్టుకొని దొంగలించబడిన తులం బంగారం, 25 తులల వెండి రికవరీ చేసిన పోలీసులు
నెల్లికుదురు ఎస్ఐ గంగారపు కరుణాకర్
నవతెలంగాణ-నెల్లికుదురు
మండలంలోని దుర్గా భవాని తండా శివారు రామోజీ తండాలో దొంగతనం పాల్పడిన వ్యక్తుల నుండి వస్తువులను డబ్బులను రికవరీ చేసినట్లు నెల్లికుదురు ఎస్సై గంగారావు కర్ణాకర్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలం లోని, దుర్గా భవానీ తండా గ్రామ శివారు రామోజీ తండా కు చెందిన జాతోత్ బుల్లి, ఆమె భర్త జాతోత్ పులాని ఇద్దరు దంపతులు మాత్రమే ఇంట్లో ఉంటారు. తమకు ఉన్న బంగారు ఆకుల గొలుసు మరియు ఒక్క జత వెండి కాళ్ళ పట్టీలు తన ఇంట్లో ఉన్న సంతుక లో పెట్టుకోగా, ఆ విషయాన్ని గమనించిన అదే తండా కు చెందిన గూగులోత్ సూర్య @ సురేష్ తండ్రి అమర్ సింగ్, అట్టి వృద్ద దంపతులు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్ళింది చూసి అట్టి తాళం తీసి, ఇంట్లో సందుక లో దాచిన బంగారు, వెండి ఆభరణాలను దొంగిలించగా, అట్టి విషయం మీద జాతోత్ బుల్లి నెల్లికుదురు పోలీస్ స్టేషన్ లో ధరఖాస్తు ఇవ్వగా అట్టి విషయం మీద నెల్లికుదురు ఎస్. ఐ. జి కరుణాకర్ కేసు నమోదు చేసి, వెంటనే అట్టి దొంగతనం చేసినా గూగులోత్ సూర్య @ సురేష్ తండ్రి అమర్ సింగ్ ను ఈ రోజు దుర్గాభవానీ తండా క్రాస్ రోడ్డు వద్ద పట్టుకొని అతని వద్ద నుండి తులం బంగారు ఆకుల గొలుసు, 25 తులాల వెండి కాళ్ళ పట్టీలు రికవరీ చేసి, అట్టి నిందితుణ్ణి తొర్రూరు కోర్టు ముందు హాజరు పరిచి, కోర్టు ఆదేశాల మేరకు జైలు కు పంపనైనది అని పోలీసులు తెలిపారు.







కామెంట్‌లు (0)