మసిగుండ్లపల్లికి 33/11 KV సబ్ స్టేషన్ మంజూరు

9 నిమిషాల క్రితం

substation
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మిడ్జిల్

మిడ్జిల్ మండలంలోని మసిగుండ్లపల్లి గ్రామానికి 33/11 KV విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరవడంపై గ్రామ సర్పంచ్ శ్రీశైలం యాదవ్ శుక్రవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. గ్రామంలో దీర్ఘకాలంగా నెలకొన్న విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు చొరవ తీసుకున్న జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


గత కొంతకాలంగా మసిగుండ్లపల్లి గ్రామంలో లో-వోల్టేజీ మరియు తరచూ విద్యుత్ అంతరాయాలతో రైతులు, గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని సర్పంచ్ శ్రీశైలం యాదవ్ ఇటీవల మిడ్జిల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. నాయకుల ద్వారా గ్రామస్థుల కష్టాలను తెలుసుకున్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వెంటనే స్పందించి, ఉన్నతాధికారులతో మాట్లాడి గ్రామానికి నూతన 33/11 KV సబ్ స్టేషన్‌ను మంజూరు చేయించారు.


సబ్ స్టేషన్ మంజూరుతో గ్రామంలోని వ్యవసాయ బోర్లకు, గృహ అవసరాలకు నాణ్యమైన నిరంతర విద్యుత్ అందుతుందని సర్పంచ్ శ్రీశైలం యాదవ్ పేర్కొన్నారు. గ్రామ ప్రజల ఆకాంక్షను నెరవేర్చినందుకు మసిగుండ్లపల్లి గ్రామస్థుల తరఫున తెలంగాణ ప్రభుత్వానికి, ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి, అలాగే ఇందుకు సహకరించిన మండల కాంగ్రెస్ నాయకులకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్