అయ్యవారిపల్లి గ్రామసభలో రసాభాస

6 నిమిషాల క్రితం

Arguments
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 27, 2026 | 1 నిమిషాల చదవడం

అక్రమాలపై నిలదీయడంతో వెనుదిరిగిన మాజీ సర్పంచ్

నవతెలంగాణ-మిడ్జిల్
మండలంలోని అయ్యవారిపల్లి గ్రామసభ రసాభాసగా సాగింది. గత పాలనలో జరిగిన అక్రమాలపై గ్రామస్తులు, యువకులు నిలదీయడంతో మాజీ సర్పంచ్ సమాధానం చెప్పకుండానే సభ నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. శుక్రవారం సర్పంచ్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు.


కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీఓ రాజశేఖర్ పాల్గొన్నారు. 2019-23 సంవత్సర పదవీకాలంలో గ్రామంలో జరిగిన అభివృద్ధి పనుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ స్థానికులు, యువకులు మాజీ సర్పంచ్‌ను ప్రశ్నించారు. ప్రజల ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేక మాజీ సర్పంచ్ మధ్యలోనే వెనుదిరిగారని గ్రామ యువకుడు శ్రీకాంత్ తెలిపారు.


ఈ సభలో పాల్గొన్న మండల పంచాయతీ అధికారి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రస్తుతం చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి , వార్డు మెంబర్లు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్