నవతెలంగాణ-నెల్లికుదురు
బాలల దినోత్సవం సందర్భంగా మండలంలోని హనుమాన్ నగర్ తండాలో బాలల గ్రామసభ నిర్వహించినట్లు ఆ గ్రామ సర్పంచ్ గుగలోతు అశోక్ కుమార్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. బాలలు విద్యా, వైద్య రంగాలలో ముందుండే విధంగా కృషి చేస్తామని అన్నారు. వారి అభివృద్ధికి సహకారం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఆంజనేయులు ఉపసర్పంచ్ శ్రీలత, వార్డ్ మెంబర్ రజిత వెంకన్న రవి అంగన్వాడి టీచర్లు శారద మైబు జాటోత్ నీల గ్రామపంచాయతీ సిబ్బంది స్కూల్ పిల్లలు ఫలితాలు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)