Magazines

అంబేద్కర్ ను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం..

27 నిమిషాల క్రితం

1003941228
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 26, 2026 | 1 నిమిషాల చదవడం

- డాక్టర్  కొంగలి శ్రీకాంత్ అడ్వకేట్

నవతెలంగాణ-మిడ్జిల్  : 77 వ జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగాన్ని అందించిన భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు నివాళులు అర్పించాల్సిన రోజున, ప్రభుత్వం ఇచ్చిన ఈ భారీ యాడ్‌లో అంబేద్కర్ ఫోటోనే లేకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నిజస్వరూపాన్ని బయటపడిందని , కాంగ్రెస్ పార్టీ అంటేనే దళిత బహుజన వ్యతిరేక పార్టీ అని జడ్చర్ల నియోజకవర్గం దళిత బహుజన నాయకులు డాక్టర్ కొంగలి శ్రీకాంత్   గురువారం ఒక ప్రకటనలో ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. 

రాజ్యాంగ దినోత్సవంలో 

 ప్రచార ఆర్భాటాలు, హంగులపై ఉన్న శ్రద్ రాజ్యాంగ నిర్మాత అయినా బాబా సాహెబ్ అంబేద్కర్ ఎందుకు గౌరవం ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

దళిత, గిరిజన ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు , అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసి ప్రభుత్వం పై ఆందోళన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు. జాతీయ నాయకులను విస్మరిస్తే గత ప్రభుత్వానికి పట్టిన గతే , కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా పడుతుందని హెచ్చరించారు. యాడుల పేరుతో ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం తప్ప ప్రజలకు వర్గ పెట్టింది ఏమీ లేదని విమర్శించారు. రాజ్యాంగ హక్కుల కోసం, దళిత బహుజనులను, ఏకం చేస్తామని పేర్కొన్నారు. ప్రజల మధ్యలో ఉండి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండ కడతామని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్