నవతెలంగాణ-మల్హర్ రావు
తాడిచెర్ల గ్రామ పరిధిలోని రామారావుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గురువారం రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించామని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి.పద్మ అన్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగ పీఠికను చదివి విద్యార్థులకు వినిపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ రాజ్యాంగం రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టిందని తెలిపారు.
ప్రపంచంలోనే అతిపెద్దదిగా భారత రాజ్యాంగం రూపొందించబడిందని పేర్కొన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు క్విజ్ పోటీలు, డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగిందన్నారు. గెలుపొందిన వారికి బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం,విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.




కామెంట్లు (0)