Magazines

అర్నాబ్ తుఫాన్‌ ఎఫెక్ట్‌..అశ్వారావుపేటలో అత్యధిక వర్షపాతం

1 గంట క్రితం

Rain
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 28, 2026 | 1 నిమిషాల చదవడం

Heaviest rainfallనవతెలంగాణ - అశ్వారావుపేట

అర్నాబ్ తుపాన్ ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో అత్యధికంగా 47.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అదే జిల్లాలోని దమ్మపేట మండలం మల్కారం గ్రామంలో 32.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కుర్నవల్లిలో 26.8 మి.మీ., యర్రుపాలెంలో 22.3 మి.మీ. వర్షం కురిసింది.


అన్నపురెడ్డిపల్లి మండలం పెంట్లంలో 21.5 మి.మీ., ఖమ్మం జిల్లా వేంసూరులో 21 మి.మీ., సత్తుపల్లి మండలం సదాశివునిపాలెంలో 20.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరులో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లిలో 20 మి.మీ. చొప్పున వర్షం కురిసింది.


వర్షపాతం గణాంకాల ప్రకారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. జాబితాలోని 57 ప్రాంతాల్లో అత్యధికంగా అశ్వారావుపేటలో 47.3 మి.మీ., అత్యల్పంగా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమాండ్ల సంకీసలో 10.5 మి.మీ. వర్షపాతం నమోదైంది.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్