నవతెలంగాణ - భీంగల్
భీంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ సేవా పథకం కార్యక్రమంలో భాగంగా శనివారం ఏక్తా దివాస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ జాతీయ సేవ పథకంలో భాగంగా నేడు కళాశాలలో ఉక్కు మనిషి సర్దార్ వల్లభా భాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని నేటి ఏక్తా దివస్ ను జరుపుకోవడం జరిగింది.
పటేల్ పట్టుదల దేశానికి వరమాయ్యేను,
జాతీయ సమైక్యతకు పునాది పడెను!
కులమత భేదాలు మన మధ్య వద్దు,
ప్రాంతీయ విభేదాలు మనసుల్లో వద్దు,
సోదరభావమే మనకు నిజమైన సంపద,
దేశభక్తియే మన జీవిత పరమార్థం!
చేతులు కలిపితే చరిత్ర సృష్టిద్దాం,
హృదయాలు కలిపితే దేశాన్ని నిలుపుదాం,
ఐక్యతా జ్యోతిని ఇంటింటా వెలిగిద్దాం,
భారతమాత కీర్తిని ప్రపంచానికి చాటుదాం!
ఒక్కటిగా నడుద్దాం.. ఒక్కటిగా నిలుద్దాం,
దేశ ప్రగతి కోసం సమష్టిగా పనిచేద్దాం,
పటేల్ ఆశయాలను ఆచరణలో పెడదాం,
ఏక్తా దివస్ స్ఫూర్తితో నవభారతం నిర్మిద్దాం! ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల ప్రిన్సిపల్ చెరుకుపల్లి జయాపాల్ రెడ్డి మాట్లాడుతూ... గొప్పగా విద్య నభ్యసించి దేశానికి మన గ్రామానికి పేరు ప్రఖ్యాతలను సంపాదించాలని అంటూనే ఈ సేవా "నాకోసం కాదు మీకోసం " అనే భావనతో మీరు సమాజంలో మీ అమూల్యమైన సేవ అందించే అవకాశం మీకు దొరకడం సంతోషకరం. ఈరోజు మన కళాశాలలో రెండు యూనిట్లు ఏర్పాటు చేసుకోవడం అందులో ఒక యూనిట్ ప్రోగ్రాం అధికారిగా శ్రీనివాస్, రెండవ యూనిట్ ప్రోగ్రాం అధికారిగా సిహెచ్ గోవర్ధన్. అనంతరం డాక్టర్ మండలోజు నర్సింహ స్వామి తెలుగు అధ్యాపకులు మాట్లాడుతూ... ఏక్తా దివస్ (జాతీయ ఐక్యతా దినోత్సవం) సందర్భంగా, ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ త్యాగనిరతిని, దేశ ఐక్యతా స్ఫూర్తిని ప్రతిబింబించేందుకు, ఐక్యమత్యమే మన జాతి బలం, సమైక్యతే మన విజయ ఫలం, భిన్నత్వంలో ఏకత్వం మన ప్రత్యేకత, భారతీయతే మనందరి గొప్ప వారసత్వం!
ఉక్కు సంకల్పానికి నిలువెత్తు రూపం,
దేశ సమైక్యతకు ఆదర్శ స్వరూపం,
సర్దార్ పటేల్ చూపిన మార్గం,
భారత చరిత్రలో మరువలేని కావ్యం! ఇలా విద్యార్థులు, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చేసే మీ సేవలు సమాజానికి ఎంతో విలువైనవని అని సందేశం ఇచ్చారు. విద్యార్థులందరూ ఈ యూనిట్లలో పేరు నమోదు చేసుకొని వారు తమ నిస్వార్ధమైన సేవను అందించాలని, దేశ పురోగతి సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ జైపాల్ రెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు శ్రీనివాస్, సిహెచ్ గోవర్ధన్, కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)