రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గునీగంటి రాజన్న
నవతెలంగాణ-నెల్లికుదురు
రైతులకు పాత రుణాలను మాఫీ చేసి, కొత్త రుణాలను మంజూరు చేయాలని రైతు సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు గునిగంటి రాజన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో సీపీఐ(ఎం) మండల కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నెల్లికుదురు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించిన ప్రభుత్వం గతంలో రైతులు తీసుకున్న రుణాలను వెంటనే మాఫీ చేసి కొత్త రుణాలు రైతులకు అందించాలని, కౌలు రైతులను గుర్తించి నష్టపరిహారం చెల్లించాలని వ్యవసాయ కార్మికులకు ఉపాధి పనులు కల్పించాలని కోరారు.
ఒకవైపు కరువు ప్రాంతాలుగా ప్రకటిస్తూనే మరొకవైపు బ్యాంకు అధికారులు ఫోన్ల ద్వారా ఓత్తిడి రైతులను బ్యాంకు రుణం తీసుకున్న వారిని తిరిగి చెల్లించాలని బ్యాంక్ అధికారులు వేధిస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే ఆ వేదింపులను ఆపివేసి తీసుకున్న రుణాలు మాఫీ చేసి తిరిగి రైతన్నలకు కొత్త రుణాలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నెల్లికుదురు మండల కార్యదర్శి ఇసంపల్లి సైదులు, నాయకులు పెరుమండ్ల బాబుగౌడ్ ,బాణాల యాకయ్య, భూక్య బిక్షపతి ,పెరుమల్ల పుల్లయ్య ,లు పాల్గొన్నారు.







కామెంట్లు (0)