- మండల బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు మాదాసు అరుణ్ కుమార్
నవతెలంగాణ - తొగుట
బీఆర్ఎస్, బీజేపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు మాదాసు అరుణ్ కుమార్ అన్నారు. గురువారం కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దిపేటలో సీఎం సభ నిర్వహిస్తున్న సందర్బంగా బీఆర్ఎస్, బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేయడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. గత ఎన్నికలలో ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
రైతులను ప్రభుత్వం నట్టేట ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వల్ల ఎక్కడ ప్రభుత్వాన్ని నిలదీస్తారో అనే భయంతోనే నాయకులను బీఆర్ఎస్, బీజెపి నాయకులను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషనులకు తరలించడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే వచ్చే ఎన్నికలలో కచ్చితంగా తగిన గుణపాఠం చెబుతామన్నారు. అరెస్టు చేసిన వారిలో బీజేపీ మండల అధ్యక్షులు చిక్కుడు చంద్రం, ఘనపూర్ మాజీ ఎంపీటీసీ కొమ్ము శరత్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మంగ నర్సింలు తదితరులు ఉన్నారు.






కామెంట్‌లు (0)