Magazines

కేంద్రం రూ.30 వేల కోట్ల సాయం చేయాలి

24 నిమిషాల క్రితం

provide assistance
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026 | 2 నిమిషాల చదవడం

జనగణనలో ఓబీసీ కులగణను చేపట్టాలి

కాంగ్రెస్‌ పీఏసీ సమావేశంలో తీర్మానం : వివరాలను వెల్లడించిన 
మంత్రి పొన్నం ప్రభాకర్

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

ఎల్‌‌నినో నేపథ్యంలో రాష్ట్రానికి కేంద్రం రూ.30 వేల కోట్లు సాయం చేయాలనీ, జనగణనలో ఓబీసీ కులగణను చేపట్టాలని కాంగ్రెస్‌ ‌రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) డిమండ్ చేసింది. ఓబీసీ కులగణన కోసం ప్రత్యేక కాలమ్‌‌ను ఏర్పాటు చేయాలని కోరింది. ఆదివారం హైదరాబాద్‌‌లోని గాంధీ భవన్‌‌లో నిర్వహించిన పీఏసీ సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. ఆ వివరాలను మంత్రి సీతక్క, ఏఐసీసీ కార్యదర్శులు ఆజ్మత్ హుస్సేన్, సంపత్ కుమార్‌లతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్‌ మీడియాకు వెల్లడించారు. సమావేశంలో నాలుగు ప్రధాన తీర్మానాలతో పాటు పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రభుత్వ-పార్టీ సమన్వయం, రాబోయే ఎన్నికలు, ప్రజా సమస్యలపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. తొలిసారి హైదరాబాద్‌కు వచ్చిన నూతన ఇంచార్జికి స్వాగతం పలుకుతూ తీర్మానించినట్టు తెలిపారు. గతంలో తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జిగా పని చేసిన మీనాక్షి నటరాజన్ ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేసినట్టు వెల్లడించారు.

రాష్ట్రంలో ఎల్-నినో పరిస్థితులు, కరువు మండలాల ప్రకటన నేపథ్యంలో ప్రజలకు అవసరమైన సహాయం అందించేందుకు పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖలు రూపొందించిన ప్రణాళికల ప్రకారం దాదాపు రూ.30 వేల కోట్ల నిధులు అవసరమవుతాయని మంత్రి తెలిపారు. తెలంగాణలో కరువు పరిస్థితులను జాతీయ విపత్తుగా పరిగణించి, రాష్ట్రానికి అన్ని విధాలా సహకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ప్రధానమంత్రికి లేఖ రాయాలని పీఏసీ సమావేశంలో తీర్మానం చేసినట్లు వెల్లడించారు. 2027 జనగణనలో 40 ప్రశ్నల నమూనాలో ఓబీసీ కాలమ్‌ను చేర్చకపోవడం పట్ల సమావేశం అభ్యంతరం వ్యక్తం చేసిందన్నారు. జనగణనలో ఓబీసీ కులగణనకు తప్పనిసరిగా ప్రత్యేక ఆప్షన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేసినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రభుత్వం-పార్టీ మధ్య సమన్వయాన్ని మరింత పెంపొందించడం, క్షేత్రస్థాయిలో పార్టీ కమిటీలు, అనుబంధ సంఘాలను పటిష్టపరచడం వంటి అంశాలపై సమావేశంలో చర్చించి కార్యాచరణ రూపొందించినట్టు తెలిపారు. బీజేపీ అప్రజాస్వామిక వైఖరి పట్ల, సర్ లో అర్హుల ఓట్లను తొలగించకుండా అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ శ్రేణలకు సమావేశం పిలుపునిచ్చిందన్నారు. రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలుచుకునేందుకు నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పని చేయాలని కోరారు. త్వరలో నూతన ఇంచార్జి రాష్ట్ర నాయకులతో విడివిడిగా సమావేశమై వారి అభిప్రాయాలను సేకరిస్తారనీ, ఆ సమావేశాలకు సంబంధించిన షెడ్యూల్ ను పార్టీ త్వరలో విడుదల చేయనున్నట్టు వెల్లడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్