Magazines

కొనసాగుతున్న భూ రీసర్వే

54 నిమిషాల క్రితం

land survey
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 22, 2026 | 1 నిమిషాల చదవడం

- రామన్నగూడెంలో 568 ఎకరాల ఓవర్‌ల్యాప్‌

- అటవీ, రెవెన్యూ శాఖల అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన

- కొలిక్కి రానున్న భూవివాదం

నవతెలంగాణ - అశ్వారావుపేట

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీసర్వే అశ్వారావుపేట మండలంలో ముమ్మరంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా రామన్నగూడెం - లంకాలపల్లి గ్రామాల మధ్య సరిహద్దు వివాదాన్ని పరిష్కరించేందుకు అటవీ, రెవెన్యూ, అటవీ అభివృద్ధి సంస్థ, పోలీస్‌ శాఖల అధికారులు గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. రామన్నగూడెం మ్యాప్‌ను పరిశీలించి సరిహద్దుల నిర్ధారణకు చర్యలు ప్రారంభించారు.


రామన్నగూడెం రెవెన్యూ పరిధిలో 30,36,39 సర్వే నెంబర్ ల్లో మొత్తం 1,245 ఎకరాల భూమి ఉండగా, అందులో సుమారు 600 ఎకరాలపై స్థానిక గిరిజనులకు, అటవీశాఖకు మధ్య చాలాకాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ భూముల్లో సుమారు 100 ఎకరాల్లో గిరిజనులు సాగు చేస్తున్నారు. మరోవైపు, సరిహద్దు గ్రామమైన లంకాలపల్లిలో అటవీశాఖ నుంచి అటవీ అభివృద్ధి సంస్థకు 1,621.36 ఎకరాల భూమి బదలాయింపు జరిగింది. ఈ భూముల్లోనూ తమకు హక్కులున్నాయని రామన్నగూడెం గిరిజనులు వాదిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కలెక్టర్ అంకిత్ ఆదేశాల మేరకు సంబంధిత శాఖల అధికారులు భూ రికార్డులు, మ్యాప్‌లను పరిశీలించి వివాద పరిష్కారానికి కార్యాచరణ చేపట్టారు. సరిహద్దుల నిర్ధారణ పూర్తయితే దీర్ఘకాలంగా కొనసాగుతున్న భూవివాదానికి పరిష్కారం లభించే అవకాశం ఉంది.


ఈ పరిశీలనలో స్థానిక సర్పంచ్ మడకం నాగేశ్వరరావు, డిప్యూటీ సర్వేయర్ నాగరాజు, టీజీఎఫ్‌డీసీ డీఎం చంద్రమౌళి,ఎఫ్‌ఆర్‌ఓ శిరోమణి, సామాజిక అటవీశాఖ ఎఫ్‌ఆర్‌ఓ మురళీ, పోలీస్‌ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్