Magazines

కుటుంబ కలహాలతో వ్యక్తి మృతి

2 గంటల క్రితం

dispute
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ–రాయపోల్ : రాయపోల్ మండలం రామారం గ్రామంలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న విభేదాల నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

రాయపోల్ ఎస్సై బి. లింగం తెలిపిన వివరాల ప్రకారం.. రామారం గ్రామానికి చెందిన వంజరి వెంకటయ్యకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు కనకయ్య (41) మూడేళ్ల క్రితం కుటుంబ సభ్యులతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లి గొల్లపల్లి గ్రామంలో నివాసం ఉంటున్నాడు. అతడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గత ఐదేళ్లుగా భార్యాభర్తల మధ్య కుటుంబ విషయాల్లో తరచూ గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. బుధవారం రాత్రి కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం కుటుంబ సభ్యులు నిద్రపోయిన సమయంలో కనకయ్య మృతి చెందాడు.

అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో కుటుంబ సభ్యులు గమనించగా అప్పటికే అతడు మృతి చెందాడు. మృతుడి తండ్రి వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లింగం తెలిపారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్