Magazines

ఎన్సీసీ 'సెమీ క్రిస్మస్' వేడుకలకు మంత్రి పొంగులేటికి ఆహ్వానం

2 గంటల క్రితం

Minister Ponguleti
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 24, 2026 | 1 నిమిషాల చదవడం

- హాజరవుతానని ఎన్సీసీ బృందానికి మంత్రి హామీ

నవతెలంగాణ-సత్తుపల్లి

నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ (ఎన్సీసీ) ప్రతినిధులు ​రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని హైదరాబాద్‌లో మంగళవారం  మర్యాదపూర్వకంగా కలిశారు. కౌన్సిల్ నేత అలవాల కరుణాకర్ ఆధ్వర్యంలో తరలివచ్చిన బృందం మంత్రికి పుష్పగుచ్ఛం అందించి డిసెంబర్ 10న సత్తుపల్లిలో జరగనున్న సెమీ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని మంత్రిని వారు సాదరంగా ఆహ్వానించారు.


​వారి ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన మంత్రి పొంగులేటి, వేడుకలకు తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎన్సీసీ సభ్యులు, పాస్టర్లు మంత్రి పొంగులేటి ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజాసేవలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.


ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు  బేతంపూడి వరప్రసాద్, ఎ. శాంసన్, ఎం. కాంతయ్య, బి. కాంతారావు, బి. ఇస్సాక్, జాన్ మార్క్, జాకబ్ శామ్యూల్, రాబర్ట్ నోబుల్, సుధీర్, రాజా, కొమ్ము శ్రీను, బీఎన్ ప్రసాద్‌తో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన ఎన్సీసీ నాయకులు, దైవ సేవకులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్