Magazines

కాటారంలో రేపు మంత్రి శ్రీధర్ బాబు పర్యటన

2 గంటల క్రితం

Minister Sridhar Babu
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 24, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మల్హర్ రావు

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు బుధవారం కాటారం సబ్ డివిజన్ పరిధిలోని కాటారం, మహాదేవపూర్ మండలాల్లో పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు కాటారం మండల కేంద్రంలోని బీఎల్ఎం గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు.


కాటారం, మహాదేవపూర్, మహాముత్తారం, మల్హర్ రావు, పలిమెల మండలాల పరిధిలోని అన్ని గ్రామాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన 2,204 మంది లబ్దిదారులకు చేయూత పెన్షన్లను మంత్రి పంపిణీ చేయనున్నారు. అలాగే, ఈ ఐదు మండలాలకు చెందిన 73 మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా అందజేయనున్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్