Magazines

రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ పథకం అమలు చేయాలి

3 గంటల క్రితం

retired journalists
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 24, 2026 | 1 నిమిషాల చదవడం

అసెంబ్లీలో ఈ అంశంపై చర్చించాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డికి జర్నలిస్టు సంఘాల వినతి

నవతెలంగాణ - పరకాల 

వృత్తి జర్నలిస్టులుగా పనిచేసి పదవీ విరమణ చేసిన అనంతరం వారి జీవనానికి ఆర్థిక భరోసా కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని జర్నలిస్టు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలుగు ప్రభ దినపత్రిక నేతృత్వంలో జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.


ఈ సందర్భంగా టిడబ్ల్యుజెఎఫ్ పరకాల డివిజన్ అధ్యక్షులు కోగిల చంద్రమౌళి మాట్లాడుతూ.. జర్నలిస్టులు తమ జీవితకాలంలో ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ, సమాజానికి విశేష సేవలందిస్తున్నారని, వృత్తి నుంచి పదవీ విరమణ చేసిన తర్వాత అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం జర్నలిస్టులు గౌరవప్రదమైన జీవనం సాగించేందుకు ప్రభుత్వం ప్రత్యేక పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేయాలని కోరారు. ఈ అంశాన్ని తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ప్రస్తావించి చర్చకు తీసుకురావాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు.


ఈ కార్యక్రమంలో తెలుగు ప్రభ దినపత్రిక ప్రతినిధులతో పాటు పరకాల డివిజన్ జర్నలిస్టు సంఘాల నాయకులు, టిడబ్ల్యూజేఎఫ్ పరకాల డివిజన్ నాయకులు కోడెపాక ప్రభాకర్,ఐజేయు నాయకులు తుడుం రవిందర్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్