Magazines

రాజ్యాంగ విలువలపై విద్యార్థులకు అవగాహన..

2 గంటల క్రితం

Students
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ–రాయపోల్ : భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, పౌరుల బాధ్యతలు, ప్రజాస్వామ్య విలువలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మండల విద్యాధికారి రాజగోపాల్ రెడ్డి సూచించారు. గురువారం రాయపోల్ మండలంలోని అన్ని పాఠశాలల్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. బేగంపేట ప్రాథమిక పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఎంఈఓ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన హక్కులు, బాధ్యతలు, ప్రజాస్వామ్య వ్యవస్థలో వాటి ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. రాజ్యాంగ పీఠికలోని ముఖ్యమైన అంశాలను తెలియజేసి, విద్యార్థులతో పీఠికను చదివించి ప్రతిజ్ఞ చేయించారు. చిన్ననాటి నుంచే రాజ్యాంగ విలువలను తెలుసుకొని, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, న్యాయం వంటి సూత్రాలను జీవితాల్లో ఆచరించాలని సూచించారు. బాధ్యతగల పౌరులుగా ఎదిగి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సీఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్