- స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించిన 5గురు విద్యార్థులు
- అభినందించిన డైరెక్టర్, ప్రిన్సిపాల్ రత్నాకర్ మొండ్రు
నవతెలంగాణ-సత్తుపల్లి
ఖమ్మం పట్టణంలోని వర్తక సంఘ భవనంలో ఆదివారం నిర్వహించిన 32వ జాతీయ కరాటే ఛాంపియన్షిప్–2026 పోటీల్లో సత్తుపల్లి మిరాకిల్ మైండ్స్- ది స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. సుమన్ షోటోకాన్ స్పోర్ట్స్ కరాటే-డో అకాడమీ ఇండియా ఆధ్వర్యంలో దివంగత వడ్డిరాజు నారాయణ స్మారకార్థం నిర్వహించిన ఈ జాతీయ స్థాయి కరాటే పోటీల్లో రాకిల్ మైండ్స్ పాఠశాలకు చెందిన 5గురు విద్యార్థులు విజేతలుగా నిలిచారు.
ఈ పోటీల్లో పి. దేవి దరహాస్ ప్రథమ స్థానం (స్వర్ణం), టి. బిందు భార్గవ్ ద్వితీయ స్థానం (రజతం) సాధించగా, ఎస్. సాయి జోషిక్, ఎస్. మణితేజ్ కుమార్, ఎం. చార్లెస్ సూర్య తృతీయ స్థానాలు (కాంశ్యాలు) దక్కించుకున్నారు. విద్యార్థులు జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం పట్ల పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులను తీర్చిదిద్దడంలో విశేషంగా కృషి చేసిన కరాటే మాస్టర్ పవన్, క్రీడా ఉపాధ్యాయులు బూరుగు మురళి, కళ్యాణ్‌లను పాఠశాల యాజమాన్యం అభినందించింది.
ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్, ప్రిన్సిపల్ రత్నాకర్ మొండ్రు మాట్లాడుతూ... విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యతనిస్తూ విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదల పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. జాతీయ స్థాయిలో పాఠశాలకు మంచి గుర్తింపు తెచ్చిన విద్యార్థులకు, శిక్షకులకు సందర్భంగా ప్రిన్సిపాల్ రత్నాకర్ అభినందించారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను విద్యార్థులు అధిరోహించాలని ఆకాంక్షించారు.






కామెంట్లు (0)