Magazines

జ్ఞానేశ్ కుమార్‌పై ‘ప్రజా అభిశంసన’

1 గంట క్రితం

'Public Impeachment' of Gyanesh Kumar
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 06, 2026 | 2 నిమిషాల చదవడం

నోటీస్‌ ఇచ్చేందుకు వెళ్లిన మాజీ ఉన్నతాధికారులు
అడుగడుగునా అడ్డుకున్న 
ఢిల్లీ పోలీసులు నిర్వాచన్‌ సదన్‌ దారులన్నీ బారికేడ్లతో మూసివేత
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌పై ‘ప్రజా అభిశంసన’ నోటీసును సమర్పించేందుకు వెళ్లిన మాజీ సివిల్‌ సర్వీస్‌ అధికారులు, సామాజిక కార్యకర్తల ప్రతినిధి బృందాన్ని ఢిల్లీ పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. ఢిల్లీలోని భారత ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం ‘నిర్వాచన్‌ సదన్‌’ కు వెళ్లే మార్గాలన్నింటినీ బారికేడ్లతో మూసివేశారు. దీంతో ప్రతినిధి బృందం నోటీసును సమర్పించలేకపోయింది. మొదటగా ఈ ప్రతినిధి బృందం ఢిల్లీ కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌ సమీపం నుంచి ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లాలని నిర్ణయించింది. అయితే, అప్పటికే అక్కడికి భారీగా చేరుకున్న భద్రతా సిబ్బంది బృందాన్ని ముందుకు కదలనివ్వలేదు. దీంతో వారు ప్రెస్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా నుంచి ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడా నిర్వాచన్‌ సదన్‌కు వెళ్లే అన్ని మార్గాలను పోలీసులు బారికేడ్లతో మూసివేశారు. దీంతో మాజీ ఐఏఎస్‌ అధికారులతో కూడిన ప్రతినిధి బృందం తిరిగి ప్రెస్‌ క్లబ్‌కు చేరుకుని మీడియాతో మాట్లాడింది. ఇంపీచ్‌మెంట్‌ ఒక్కటే మార్గం సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే పరిస్థితి కనిపించకపోవడంతో ఆయనపై అభిశంసన ప్రక్రియ చేపట్టడం తప్ప మరో మార్గం లేదని ప్రతినిధి బృందం సభ్యులు తెలిపారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అనేక అనుమానాలు నెలకొన్నాయని పేర్కొన్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియ కారణంగా 13 కోట్ల మంది తమ ఓటు హక్కును కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. పౌరసత్వాన్ని నిరూపించుకు నేందుకు ప్రజలను వివిధ పత్రాలు సమర్పించాలని బలవంతపెట్టడం ద్వారా ఇబ్బందులకు గురిచేస్తున్నా రన్నారు. ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాల్సిన ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం నిలబెట్టాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. సీఈసీకి వ్యతిరేకంగా ‘ప్రజా అభిశంసన నోటీసు’ను అందజేసేందుకు మాజీ ఐఏఎస్‌ అధికారులు నజీబ్‌ జంగ్‌, జి.కె. పిళ్లై, అమితాబ్‌ పాండే, అశోక్‌ శర్మ, యశోవర్ధన్‌ ఆజాద్‌ తదితరులతో కూడిన బృందం వెళ్లింది. ఈ బృందంలో సామాజిక కార్యకర్తలు యోగేంద్ర యాదవ్‌, అంజలి భరద్వాజ్‌, ఎస్ఎఫ్ఐ అఖిల భారత జాయింట్‌ సెక్రెటరీ ఐషీ ఘోష్‌, ఎఐఎస్ఏ నాయకురాలు అంజలి, ఎఐఎస్ఎఫ్‌ నేత దినేశ్‌ శ్రీరంగరాజన్‌ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్