Magazines

పెరుగుతున్న పీహెచ్‌డీలు..

2 గంటల క్రితం

Rising number of PhDs...
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 06, 2026 | 3 నిమిషాల చదవడం

వలస వెళ్తున్న ప్రతిభావంతులు
దేశంలో మూడింతలైన పీహెచ్‌డీ నమోదు
ఐఐటీల్లో 38 శాతం అధ్యాపక పోస్టులు ఖాళీ
పరిశోధనకు సరైన వేతనం, నిధులు, 
స్వేచ్ఛ లేకపోవడమే ప్రధాన సమస్య

న్యూఢిల్లీ : దేశంలో పీహెచ్‌డీ చేసే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. 2014–15లో 1.17 లక్షలుగా ఉన్న పీహెచ్‌డీ నమోదు 2023–24 నాటికి 3.44 లక్షలకు చేరింది. కానీ మరోవైపు దేశంలోని ప్రముఖ విద్యా సంస్థల్లో అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 23 ఐఐటీల్లో మంజూరైన అధ్యాపక పోస్టుల్లో సుమారు 38 శాతం ఖాళీగా ఉన్నట్టు ప్రభుత్వ గణాంకాల ఆధారంగా చేసిన విశ్లేషణ వెల్లడిం చింది. అంటే పరిశోధనలోకి ఎక్కువ మందిని తీసుకొస్తున్నప్పటికీ.. వారికి బోధిం చడానికి, పరిశోధనను ముందుకు తీసుకెళ్ల డానికి అవ సరమైన అధ్యాపకులను నియమిం చడంలో దేశం వెనుకబడుతోంది. పీహెచ్‌డీ చేసిన ప్రతి ఒక్కరూ ప్రతి అధ్యాపక పోస్టుకు అర్హుల వుతారని చెప్పలేం. వారి ప్రత్యేకత, పరిశోధన నాణ్యత, నియామకాల్లో జాప్యం వంటి అంశాలు కూడా ఉంటాయి. అయితే అసలు ప్రశ్న.. ప్రతిభావంతులు పరిశోధన, బోధనను వృత్తిగా ఎంచుకునేలా మన విద్యావ్యవస్థ తగిన పరిస్థితులు కల్పించడం లేదా? అన్నదే. వేతనాలూ.. జీవన వ్యయాలూ ప్రస్తుతం జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ (జేఆర్‌ఎఫ్‌) కింద మొదటి రెండేండ్లు నెలకు రూ.37 వేలు, ఆ తర్వాత సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌లో రూ.42 వేలు లభిస్తున్నాయి. నగరాల్లో జీవన వ్యయాలను దృష్టిలో పెట్టుకుంటే ఈ మొత్తం పరిమితమే. మరోవైపు అమెరికాలోని ఎంఐటీ వంటి సంస్థల్లో డాక్టరల్‌ పరిశోధకులకు ఏడాదికి 50 వేల డాలర్లకు పైగా వేతనం లభిస్తోంది. దీంతో భారత్‌లో మంచి విద్యార్థికి పీహెచ్‌డీ కంటే బయట ఉద్యోగం ద్వారా ఆర్థికంగా స్థిరపడటం ఆకర్షణీయంగా మారుతోంది. పరిశోధనపై ఆసక్తి ఉన్నంత మాత్రాన ఇల్లు, కుటుంబం, భవిష్యత్‌ వంటి అవసరాలను పక్కన పెట్టలేరు. అందుకే విశ్వ విద్యాలయాలు కేవలం పరి శోధనపై ప్రేమను ఆశించకుండా, గౌరవ ప్రదమైన ఆర్థిక భద్రతను కూడా కల్పించాలని మేధావులు, విద్యావేత్తలు సూచిస్తున్నారు.
పరిశోధనకు స్వేచ్ఛ అవసరం విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వ నిధులు అవసరమే. అయితే పరిశోధన, బోధనకు సంబంధించిన నిర్ణయాల్లో అధిక ప్రభుత్వ జోక్యం ఉండకూడదని మేధావులు అంటు న్నారు. అధ్యాపకులకు బోధన, పరిశోధనలో స్వతంత్రత, అనవసర జోక్యాల నుంచి రక్షణ అవసరమని సూచిస్తున్నారు. అలాగే పరి శోధన నాణ్యతను కేవలం ఎన్ని పేపర్లు ప్రచురించారనే లెక్కతో నిర్ణయించడం సరికాదనీ, నాణ్యమైన, కొత్త ఆలోచనలతో కూడిన పరిశోధనకు సమయం పడుతుందని వివరిస్తున్నారు. గతంలో అనుమానాస్పద, నకిలీ పరిశోధనా జర్నల్స్‌ సమస్య కూడా ఎదురైందన్న విషయాన్నీ వారు గుర్తు చేస్తున్నారు. అందువల్ల పబ్లికేషన్ల సంఖ్యను మాత్రమే పరిశోధన నాణ్యతకు కొలమానంగా చూడకూడదని వివరిస్తున్నారు. దీర్ఘకాలిక నిధులు కీలకం పరిశోధనకు స్థిరమైన, దీర్ఘకాలిక నిధులు అవసరం. ఐఐటీ మద్రాస్‌ 2025–26లో సీఎస్‌ఆర్‌.. పూర్వ విద్యార్థుల విరాళాల ద్వారా రూ.513 కోట్లు సమీకరించింది. ఇలాంటి ప్రయత్నాలను ఇతర విశ్వ విద్యాల యాలు కూడా విస్తరించాలని మేధావులు సూచిస్తు న్నారు. ''కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) నిధులను దీర్ఘకాలిక పరిశోధనకు మరింత సులభంగా వినియో గించేలా నిబంధ నలను మార్చాల్సిన అవసరం ఉంది. ముఖ్యం గా న్యాయం, మానవీయ శాస్త్రాలు, సామాజిక శాస్త్రాల్లో పరిశోధనకు కూడా స్థిరమైన నిధులు అందేలా మార్గం కల్పించాలి. ఉదాహరణకు నెలకు రూ.2 లక్షల చొప్పున 100 మంది ప్రతిభావంతులైన పరిశోధకులకు ఫెలోషిప్‌ ఇస్తే ఏడాదికి రూ.24 కోట్లు ఖర్చవుతుంది. సరైన ఎంపిక, నాణ్యమైన మార్గదర్శకత్వం, భవిష్యత్‌ ఉద్యోగ అవ కాశాలతో కలిపితే ఇది ప్రతిభా వంతులు పరిశోధనను వృత్తిగా ఎంచు కునేలా చేయ గలదు. దేశంలో పీహెచ్‌డీల సంఖ్య పెరగడం మాత్రమే పరిశోధన అభివృద్ధికి సూచిక కాదు. ప్రతిభావంతులు దేశంలోనే ఉండి పరిశోధన చేసేలా వేతనాలు, నిధులు, స్వేచ్ఛ, సహాయక వ్యవస్థ, భవిష్యత్‌ అవకాశాలు కల్పించినప్పుడే ఆ పెరుగుదలకు నిజమైన అర్థం ఉంటుంది'' అని వారు చెప్తున్నారు.
జీతంతోనే సమస్య తీరదు
మంచి అధ్యాపకులను ఆకర్షించడానికి అధిక వేతనం మాత్రమే సరిపోదు. పరిశోధనకు నిధులు, పరిశోధనా బృందాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం, అడ్మినిస్ట్రేషన్‌ సహాయం కూడా అవసరం. ఒక అధ్యాపకుడు బోధనతో పాటు తరగతుల సిద్ధత, విద్యార్థుల పరిశోధన పర్యవేక్షణ, పరి పాలనా సంబం ధిత పనులు కూడా చేయాల్సి ఉంటుంది. కాబట్టి అధ్యాపకులకు తగిన సహా యక సిబ్బందిని అందించాల్సిన అవసరం ఉంది. పీహెచ్‌డీ విద్యార్థులు బోధనలో సహ కరిస్తే అందుకు తగిన పారితోషికం, సరైన పనిగంటలు ఉండాలి. పరిశోధనకు అవస రమైన సమయం తగ్గకుండా ఈ వ్యవస్థను రూపొందించాలని విద్యావేత్తలు వివరిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్