నవతెలంగాణ హైదరాబాద్: స్పెయిన్ దేశంలో ఒక ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది.సెంట్రల్ స్పెయిన్‌లోని టొలెడో ప్రావిన్స్‌లో రెండు హైస్పీడ్ రైళ్లు ఒకదానికొకటి ఢీకొనడంతో 30మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు.బుధవారం ఉదయం ఈ దుర్ఘటన జరిగినట్లు స్పెయిన్ రైల్వే వ్యవస్థ నిర్వాహక సంస్థ (ADIF)ధ్రువీకరించింది.
ఒకే దిశలో ప్రయాణిస్తున్న రెండు వేగవంతమైన రైళ్లలో,వెనుక నుండి వచ్చిన ఒక రైలు ముందున్న మరో రైలును బలంగా ఢీకొట్టింది.ఈ తీవ్ర ధాటికి రెండు రైళ్లకు చెందిన పలు బోగీలు పట్టాలు తప్పాయి.ప్రమాద తీవ్రత కారణంగా మాడ్రిడ్,సియుడాడ్ రియల్,అండలూసియా ప్రాంతాల మధ్య రైల్వే సేవలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.
ఈ ఘటనలో 30మంది ప్రాణాలు కోల్పోగా, 100మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారని ఉర్దా పట్టణ మేయర్ మాన్యుయెల్ గలాన్ తెలిపారు.క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారని,మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.గతంలో కూడా జనవరి నెలలో దక్షిణ స్పెయిన్‌లో ఒక రైలు పట్టాలు తప్పి ఎదురుగా వచ్చిన రైలును ఢీకొన్న ఘటనలో 45మంది మరణించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటున్నారు.





కామెంట్లు (0)