Magazines

మహిళలకు 50 శాతం సీట్లు

1 గంట క్రితం

కల్వకుంట్ల కవిత
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 13, 2026 | 1 నిమిషాల చదవడం


కల్వకుంట్ల కవిత

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

రిజర్వేషన్లతో సంబంధం లేకుండా 50 శాతం సీట్లను మహిళలకు ఇస్తామని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత తెలిపారు. సోమవారం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయంలో మహిళా నాయకులతో కలిసి కవిత పాటలు పాడుతూ బతుకమ్మలు పేర్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో బతుకమ్మ పండుగ ద్వారా మహిళలను ఒక్కతాటిపైకి తీసుకురావడానికి ఎలా కృషి చేశారో వివరించారు. మమహిళలు, బహుజనుల కోసం పాటు పడుతున్న తనను ఆశీర్వదించాలని రాష్ట్ర ప్రజలకు కవిత విజ్ఞప్తి చేశారు. బతుకమ్మ సంబురాల సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళా నాయకత్వాన్ని పెంపొందించడానికి తాను కృషి చేస్తున్నానని తెలిపారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి బతుకమ్మ ప్రతీకగా నిలిచిందని గుర్తు చేశారు. గౌరమ్మ తల్లి ఆశీర్వాదంతో తెలంగాణ ఆడబిడ్డలందరూ ఆనందంగా ఉండాలని ఆమె ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్