హాజరైన స్పీకర్,చైర్మెన్
నవతెలంగాణ -హైదరాబాద్
బతుకమ్మ కేవలం పండుగ మాత్రమే కాదననీ, తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ప్రకృతిని ఆరాధించే గొప్ప సంస్కృతికి ప్రతీక అని తెలంగాణ శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికి ఆదర్శమని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొనియాడారు. అసెంబ్లీ ప్రాంగణంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన స్పీకర్ చైర్మెన్ పాల్గొన్నారు. మహిళలను అభినందించారు. బంతి, చామంతి, గునుగు, తంగేడు పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను మధ్యలో ఉంచి, మహిళా ఉద్యోగులు, సిబ్బంది చుట్టూ చేరి "బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో" అంటూ ఆడి పాడారు. మహిళలంతా బతుకమ్మల చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ భక్తిశ్రద్ధలతో బతుకమ్మను నిర్వహించారు. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మీయత, ఉత్సాహం మధ్య సాగిన ఈ వేడుకలు పండుగ వాతావరణాన్ని తలపించాయి. అసెంబ్లీ ప్రాంగణం సాయంత్రం రంగురంగుల పూలతో, ఆడపడుచుల ఆనంద కోలాహలంతో కళకళలాడింది. బతుకమ్మ వేడుకల్లో శాసన మండలి సెక్రెటరీ డిప్యూటీ చైర్మెన్ బండ ప్రకాష్‌తోపాటు కార్యదర్శి డా. నరసింహాచార్యులు , శాసనసభ కార్యదర్శ ఆర్. తిరుపతి , శాసనసభ, శాసన మండలి ఉన్నతాధికారులు, మహిళా ఉద్యోగులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)