నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సర్ ప్రక్రియకు వ్యతిరేకంగా, సీఈఈ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ తో ఏఐసీసీ ఆధ్వర్యంలో సోమవారం న్యూఢిల్లీలో చేపట్టిన నిరసన ర్యాలీలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు కదం తొక్కారు. సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. సుప్రీంకోర్టు వరకు నిర్వహించిన ర్యాలీలో సీఎం, పీసీసీ అధ్యక్షునితో పాటు డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు, డీసీసీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్పోరేషన్ చైర్మెన్లు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, ఓట్ల చోరీకి వ్యతిరేకంగా దేశమంతా ఢిల్లీకి కదిలి వచ్చిందని తెలిపారు. ఓట్లచోరీతోనే గెలవాలని బీజేపీ ప్రయత్నిస్తుంటే, బీజేపీకి ఎన్నికల కమిషన్ మద్దతిస్తున్నదని విమర్శించారు. సర్ అక్రమాలపై అనేక ఆధారాలున్నాయనీ, తమ వాదనలను సుప్రీంకోర్టు వినాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.






కామెంట్‌లు (0)