సాత్విక్ వర్మ, అనీ హీరో, హీరోయిన్గా నటిస్తున్న చిత్రం ‘తొలి ప్రేమ కథ’. లిఖిత్, ఆదిత్య సమర్పణలో లతా కె నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి లక్ష్మణ్ అల్లు దర్శకత్వం వహిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌కి అతిథిగా హాజరైన డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ, ‘ఈ సినిమాని కరెక్ట్ టైమ్‌లో మూడ్ ఆఫ్ ది సీజన్ అని చెప్పొచ్చు. ఇలాంటి సినిమాల కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. రైట్ టైమ్‌లోనే ఈ సినిమా వస్తోంది. టీజర్ చూస్తుంటే చాలా హాయిగా ఉంది. చాలా జెన్యూన్‌గా, నేచురల్‌గా ఉంది. సాత్విక్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసి ఇప్పుడు హీరోగా వస్తున్నాడు. నాకు ఈ టీజర్ చాలా నచ్చింది. అలాగే ఇందులో సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ చాలా అద్భుతంగా అనిపించాయి. ధ్రువన్ అద్భుతమైన మెలోడీ ఇచ్చాడు. ఈ సినిమాని కచ్చితంగా థియేటర్లో చూస్తాను. అలాగే ఇందులో చివర్లో వినిపించిన డైలాగ్స్ కూడా నాకు చాలా నచ్చాయి. డైరెక్టర్ చాలా అద్భుతంగా తీశారు.
ఇది థియేటర్లో చూడాల్సిన సినిమా’ అని తెలిపారు.
‘ఇందులో విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. టీజర్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలి’ అని మరో ముఖ్యఅతిథి ఆకాష్ పూరి చెప్పారు. ప్రొడ్యూసర్, డైరెక్టర్ సాయి లక్ష్మణ్ అల్లూ మాట్లాడుతూ, ‘చాలా అద్భుతమైన లొకేషన్స్‌లో ఈ సినిమాని షూట్ చేశాను. సినిమా చాలా బ్యూటిఫుల్‌గా వచ్చింది’ అని తెలిపారు.
‘ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. కచ్చితంగా ఈ సినిమా చాలా మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. మా సాయి, కృష్ణ, హీరోకి ధన్యవాదాలు. సినిమా చాలా బ్యూటిఫుల్‌గా వచ్చింది. తప్పకుండా మీరందరూ ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను’ అని ఆర్.ఆర్. ధ్రువన్ చెప్పారు.
హీరో సాత్విక్ వర్మ మాట్లాడుతూ,‘టీజర్ మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. ఇది మంచి మ్యూజికల్ లవ్ స్టోరీ. మా నిర్మాత, దర్శకుడు సినిమాని చాలా అద్భుతంగా తీశారు’ అని అన్నారు.
రైట్ టైమ్‌లో వస్తున్న ప్రేమకథ
13 నిమిషాల క్రితం

balaji
ప్రచురించబడింది నవం 07, 2026 | 2 నిమిషాల చదవడం





కామెంట్లు (0)