అక్కినేని నాగార్జున సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. అనీష్ హీరోగా పరిచయం అవుతుండగా, అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్నారు. మహేష్ ఉప్పల దర్శకుడిగా పరిచయం అవుతుండగా,దర్శకుడు వెంకీ కుడుముల ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం అవు తున్నారు. ఆయన కొత్తగా ప్రారం భించిన వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమా ఈనెల 13న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత వెంకీ కుడుముల విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
ఒక మంచి కథతో నిర్మాణ రంగంలోకి రావాలని ఎప్పటి నుంచో ఉండేది. డైరెక్టర్ మహేష్ చెప్పిన ఈ కథ నాకు చాలా నచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది. నా తొలి నిర్మాణానికి బాగుం టుందనిపించింది.
ఈ కథకు ఫ్రెష్ హీరో అయితే బాగుం టుందనిపించింది. ఇది మూగవాడి క్యారెక్టర్. కాబట్టి ఇదివరకు తెలిసిన క్యారెక్టర్ అయితే ఆడియన్స్ కన్విన్స్ అవుతారో లేదో తెలియదు. అందుకే ఫ్రెష్‌గా ఉంటుందని అనీష్‌ను తీసుకున్నాం. అలాగే అనస్వరకి కథ చెప్పాం. తనకి కూడా చాలా నచ్చింది.
అనీష్ యాక్షన్ చాలా అద్భుతంగా చేశాడు. ఎక్కడా మేము డూప్‌ను ఉపయోగించలేదు. అనీష్ కోసం నా డైరెక్షన్లో ఒక సినిమా చేసే ఆలోచన కూడా ఉంది.
సినిమా కంటెంట్‌ను ఎంచు కోవడం, దాన్ని ప్రొడ్యూస్ చేయడం మీద నాకు ఒక ఆలోచన ఉంది. కాకపోతే, దాన్ని ఎలా రిలీజ్ చేయాలి, ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేది ఎప్పుడూ ఒక ఒత్తిడిగా ఉండేది. నాగార్జున రావడం వల్ల అది మాకు చాలా హెల్ప్ అయింది. ఆయన వచ్చిన తర్వాత మా వర్క్ అంతా చాలా ఈజీ అయింది.
ఆయనకి ఈ సినిమా గ్లింప్స్ చూపించాను. నచ్చితేనే వాయిస్ ఓవర్ చెప్పమని అడిగాం. ఆయ నకు గ్లింప్స్ చాలా నచ్చాయి. ఆయన వాయిస్ ఓవర్ చెప్పారు. ఆ గ్లింప్స్‌లోని విజువల్స్ నచ్చి, మా సినిమాకు పనిచేస్తున్న డీఓపీనే ఆయన ‘కింగ్ 100’ సినిమాకు డీఓపీగా పెట్టుకున్నారు.
ఎన్టీఆర్ మా ట్రైలర్‌ని లాంచ్ చేయడం చాలా హ్యాపీగా అనిపిం చింది. ఆయన సినిమా కంటెంట్ గురించి, అనీష్ పర్ఫార్మెన్స్ గురించి చాలా గొప్పగా చెప్పారు. అది మాకు చాలా బూస్ట్ ఇచ్చింది.
తమన్ ‘తొలిప్రేమ’ సినిమాకు చేసిన మ్యూజిక్ నాకు చాలా ఇష్టం. ఆయన ఈ సినిమాకి చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. పాటలన్నీ సూపర్ హిట్ అయ్యా యి. నేపధ్య సంగీతం కూడా చాలా అద్భుతంగా చేశారు.
నాకు ఒకరు అవకాశం ఇవ్వడం వల్లే నేను డైరెక్టర్ అయ్యాను. నేను కూడా కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో నిర్మాణం మొదలుపెట్టాను. కొత్త వాళ్లు చెప్పిన కథ నాకు నచ్చితే కచ్చితంగా నిర్మాణం కొనసాగిస్తాను.






కామెంట్లు (0)