అక్కినేని నాగార్జున సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. అనీష్ హీరోగా పరిచయం అవుతుండగా, మలయాళ నటి అనస్వర రాజన్ కథా నాయికగా నటిస్తున్నారు.మహేష్ ఉప్పల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌తో దర్శకుడు వెంకీ కుడుముల నిర్మాతగా కూడా పరిచయం అవుతున్నారు. ఆయన కొత్తగా ప్రారంభించిన వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఈనెల 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటిం చారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆకర్షణీయమైన విజువల్స్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకట్టు కుంటోంది.
ఈ సినిమా అర్జున్ అనే మూగ యువకుడి చుట్టూ తిరిగే ఓ విభిన్నమైన ప్రేమకథ. అర్జున్ తన జీవితమంతా కీర్తిని మౌనంగా ప్రేమిస్తుంటాడు. అతని ప్రయాణం అనూహ్య మైన మలుపులు తిరుగుతుంది. ప్రేమ, హాస్యం, సాహసం, ఊహించని ట్విస్టులతో సాగే ఈ కథ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది. విభిన్నమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం భావోద్వేగాలు, వినోదం కలగలిసిన ఆసక్తికరమైన ప్రేమకథగా అలరించనుంది.
నాగార్జున ఇప్పటికే ఈ సినిమాను వీక్షించి, ఇందులోని కొత్త కాన్సెప్ట్, విభిన్నమైన కథనాన్ని అభినందించారు. ఆయన ప్రోత్సాహం, మద్దతు ఈ యువ చిత్ర బృందానికి మరింత ఉత్సాహాన్నిచ్చాయి.







కామెంట్‌లు (0)