ప్రముఖ స్ట్రీమింగ్ సర్వీస్ ప్రైమ్ వీడియో ‘ది ట్రెయిటర్స్ తెలుగు’ తో అలరించనుంది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ రియాలిటీ ఫార్మా ట్‌ను తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యే కమైన స్థానిక హంగులతో తీసు కొస్తున్నారు. హీరో తేజ సజ్జ ఈ షోని హోస్ట్ చేస్తున్నారు. ఈ నెల 15నుంచి ప్రతి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు కొత్త ఎపిసోడ్ విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో తేజ సజ్జా మీడియాతో ముచ్చటించారు. ట్రెయిటర్స్ గ్లోబల్‌గా చాలా పెద్ద హిట్ ఫ్రాంచైజ్. 20కి పైగా దేశాల్లో, 25కి పైగా భాషల్లో చేశారు. హిందీలో కరణ్ జోహార్ చేసి నప్పుడు నాకు దాని గురించి పెద్దగా ఆలోచన లేదు. ఒక ఎపిసోడ్ చూడడం మొదలుపెట్టి రెండు రోజుల్లో మొత్తం సీజన్ పూర్తి చేశాను. నాకు అప్పుడే కాన్సెప్ట్, షో నచ్చింది. ‘మిరాయ్’ సినిమా తర్వాత అమెజాన్ వాళ్లు నన్ను సంప్రదించారు. నా కెరీర్‌లో చాలా త్వరగా ఓకే చేసిన ప్రాజెక్ట్ ఇదే. ఈ షో ఫార్మాట్ అంత స్ట్రాంగ్‌గా ఉంది కాబట్టే, అన్ని భాషల్లో విజయవంత మైంది. తెలుగులో ఇంత పెద్ద స్కేల్‌లో ఒక రియాలిటీ షో ఎప్పుడూ చూడలేదు. ఈ షో ఫార్మాట్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. నిజంగా ఇది ఒక మర్డర్ మిస్టరీ సినిమాలా థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టుగా ఉంటుంది. ఈ షోను హోస్ట్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను. 11 రోజులు షూట్ చేశాం. మొత్తం పది ఎపిసోడ్లు. హోస్ట్ క్యారెక్టర్ కూడా ఇందులో చాలా కీలకం. ఇటీవలే ‘జాంబీ రెడ్డి 2’ షూటింగ్ స్టార్ట్ చేశాం. చాలా క్రేజీ ఎంటర్ టైనర్ చేయాలనేది మా ప్రయత్నం. ఇది కచ్చితంగా అలరిస్తుంది.
మిస్టరీ థ్రిల్లర్‌లాంటి గేమ్ షో..
5 గంటల క్రితం

balaji
ప్రచురించబడింది అక్టో 07, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)