సంతోష్ రాజా, శ్రేయాస్ సేన్ జంటగా రూపొందుతున్న చిత్రం 'మొహబ్బత్'. ఏబీఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై మ్యాక్ దర్శకత్వంలో అఫ్రోజ్ షేక్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర టీజర్ ఆవిష్కరణ శుక్రవారం జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో నవదీప్ టీజర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘నిర్మాత అఫ్రోజ్ అమెరికాలో జాబ్ చేసి, వాళ్ల సొంత ఊరిలో స్కూల్ కట్టించడం, ఇప్పుడు తన డ్రీమ్ సినిమాను నిర్మిస్తున్నారు. కొత్తవాళ్లను ఈసినిమా ద్వారా దర్శకుడు ఎంకరేజ్ చేశాడు. ఈ సినిమా విజువల్స్, టీజర్ బాగుంది. తప్పకుండా ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ‘ఇది ‘ప్రేమిస్తే’ తరహా ఉండే కథ. దర్శకుడు చెప్పిన ఈ స్టోరీ నాకు బాగా నచ్చింది. తప్పకుండా ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుంది’ అని నిర్మాత అఫ్రోజ్ షేక్ చెప్పారు. దర్శకుడు మ్యాక్ మాట్లాడుతూ,‘ఈ కథను నమ్మి సినిమా కోసం నిర్మాత ఎంతో ఖర్చుపెట్టారు. కొత్త విషయం చెప్పాలన్న తాపత్రయంతో ఈ సినిమా చేశాం. బ్యూటిఫుల్ ఎమోషనల్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ఎక్కడా కూడా బోర్ కొట్దదు’ అని తెలిపారు. ‘ఇది నాకు చాలా ప్రత్యేకమైన సినిమా’ అని హీరోయిన్ శ్రేయాస్ సేన్ అన్నారు. ‘కడపలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తీసిన మ్యూజికల్ ఎమోషనల్ లవ్‌స్టోరి ఇది. ఈ సినిమాకు ఫొటోగ్రఫీ, మ్యూజిక్ ప్రధాన బలం’ అని హీరో సంతోష్ తెలిపారు.







కామెంట్‌లు (0)