‘రాజు వెడ్స్ రాంబాయి’ సూపర్ హిట్ తర్వాత నిర్మాత వేణు ఊడుగుల తన సమర్పణలో ‘చంద్రయాన్’ టైటిల్ తో మరో ఇంట్రెస్టింగ్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్, లోకేష్, బలగం సత్యనారాయణ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సింబ స్క్రీన్ స్టోరీస్ బ్యానర్ పై శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకత్వంలో ప్రవీణ్ మొలక నిర్మిస్తున్నారు. హిలేరియస్ అడ్వెంచర్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 30న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ నేపథ్యంలో శనివారం ఈ చిత్ర గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ ను ప్రముఖ ఆస్ట్రలాజర్ వేణు స్వామి అతిథిగా ఘనంగా నిర్వహించారు. ‘వేణు ప్రెజెంట్స్ చేస్తున్నారంటే ఈ సినిమా సక్సెస్ అని అనుకోవచ్చు. ఆయన స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న మూవీస్ మన ముందుకు తీసుకొస్తుంటారు. గ్లింప్స్ చూస్తుంటేనే ఈ సినిమా మంచి ఎంటర్ టైన్ మెంట్ ఇస్తుందని అర్థమవుతోంది’ అని ప్రొడ్యూసర్ డా.పూజారి నాగేశ్వరరావు చెప్పారు. హీరో శివకుమార్ ధీకొండ మాట్లాడుతూ, ‘ఈ చిత్రానికి దాదాపు అందరం కొత్త వాళ్లమే పనిచేశాం. మా లాంటి వాళ్లతో సినిమా చేసిన మా ప్రొడ్యూసర్స్ గట్స్ ను అప్రిషియేట్ చేయాలి. మా సినిమా అద్భుతంగా వచ్చింది. ప్రేక్షకులకు ఈ సినిమా ఓ సరికొత్త థియట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది’ అని తెలిపారు. డైరెక్టర్ శ్రీనాథ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, ‘మందమర్రి టు చందమామ, ఆగేది కాదు ఇది ఫుల్ హంగామా. గ్లింప్స్ చూసి మా యాక్టర్స్ అమాయకులు అంటున్నారు. కానీ వీళ్లు అమాయకులే కాదు ధైర్యవంతులు కూడా. వీళ్లు ఏమీ తెలియకుండా రాకెట్ ఎలా చేశారు, స్పేస్ కు ఎలా వెళ్లారు అనేది మీరంతా సినిమాలో చూడబో తున్నారు’ అని అన్నారు. ‘డైరెక్టర్ శ్రీనాథ్ ఈ కథ చెబుతున్నప్పుడు రెండున్నర గంటలు ఒక ఫ్రెండ్ తో సరదాగా మాట్లాడుకుంటే ఎంత హ్యాపీగా ఫీలవుతామో అలా ఫీలయ్యాను. ఫ్యామిలీతో కలిసి హాయిగా చూసే సినిమా’ అని నిర్మాత ప్రవీణ్ మొలక చెప్పారు. సమర్పకుడు వేణు ఊడుగుల మాట్లాడుతూ,‘ఈ సినిమా చూసిన తర్వాత ఈ చిత్రంలో నేను పార్ట్ కావాలని అనిపించింది. ఇది రెగ్యులర్ రొటీన్ సినిమా కాదు. ఒక అర్థవంతమైన సినిమా. అలాగే ఈ చిత్రాన్ని కమర్షియల్ ఇంపాక్ట్ ఉన్న ట్రీట్‌మెంట్తో రూపొందించారు’ అని అన్నారు.







కామెంట్‌లు (0)