Magazines

దసరా పండుగకు సరైన సినిమా

1 గంట క్రితం

movie
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026 | 2 నిమిషాల చదవడం

నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'క్రేజీ కల్యాణం'. ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 2గా ప్రొడ్యూసర్ బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు బద్రప్ప గాజుల రూపొందిస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా ఈ నెల 16న ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం నిర్మాత బూసం జగన్ మోహన్ రెడ్డి ముచ్చటించారు.

- మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కథతో ఈ సినిమాను నిర్మించాం. మా సినిమాను ఈ నెల 30న రిలీజ్ చేయాలని అనుకున్నాం. అయితే వెంకటేష్ 'ఆదర్శ కుటుంబం' సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ కావడంతో మా టీమ్ అందరూ పండుగకు రిలీజ్ చేయండి అని సూచించారు. మా సినిమా కూడా మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కాబట్టి పండుగకు రిలీజ్ చేస్తే బాగుంటుంది అని భావించి ఈ నెల 16నే రిలీజ్ కు తీసుకొస్తున్నాం.

- మా మూవీ కంటెంట్ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ స్క్రిప్ట్ ఎవరు విన్నా ఇష్టపడ్డారు. అనుపమ, నరేష్, తరుణ్ భాస్కర్, అఖిల్ ..ఇలా అందరూ కథ చాలా బాగుందని చెప్పారు. మాకు స్క్రిప్ట్ మీద ఉన్న నమ్మకం, వాళ్లు ఇచ్చిన రెస్పాన్స్ తో మరింత కాన్ఫిడెన్స్ పెరిగింది.

- యాడ్ ఫిలిం మేకింగ్ లో నా అనుభవం నిర్మాతగా వ్యవహరించేందుకు బాగా ఉపయోగపడింది. నిర్మాతగా ఇది నా రెండో మూవీ. ఇది ఫ్యూర్ తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో సాగే చిత్రమిది. అయితే యూనివర్సల్ ఎమోషన్స్ ఉన్న సబ్జెక్ట్ ఇది.

- దర్శకుడిగా బద్రప్ప గాజులకు ఇది మొదటి సినిమా కావొచ్చు కానీ ఆయన యాడ్ ఫిలింస్ కు వర్క్ చేశాడు. ఆయన ప్రతిభ గురించి నాకు తెలుసు. పైగా కథ చాలా బాగుంది కాబట్టి ఏమాత్రం సందేహం లేకుండా మూవీ ప్రొడ్యూస్ చేశాను. మా సినిమాకు శాటిలైట్, ఓటీటీ, మ్యూజిక్..రైట్స్ అమ్మకం జరిగిపోయింది.

- దసరా పండుగ తెలంగాణలో చాలా పెద్ద పండుగ. ఈ పండుగకు ఎన్ని సినిమాలు వచ్చినా ప్రేక్షకులు చూస్తారు. మొదట్లో మాకు తక్కువ థియేటర్స్ లభించినా, మౌత్ టాక్ తో , పాజిటివ్ టాక్ తో ఎక్కువ స్క్రీన్స్ పెరుగుతాయనే నమ్మకం ఉంది. కంటెంట్ మీద, సక్సెస్ మీద పూర్తి కాన్ఫిడెంట్ తో ఉన్నాం. ప్రతి ఊరిలో, ప్రతి ఇంటిలో జరిగే కథ ఇది. ఎంటర్ టైన్ మెంట్ తో పాటు మంచి ఎమోషన్ ఉంటుంది. సినిమా చూశాక థియేటర్ నుంచి ఒక గుడ్ ఫీల్ తో బయటకు వస్తారు. బొమ్మరిల్లు వంటి సినిమాలు చూసినప్పుడు ఎలాంటి అనుభూతికి లోనవుతామో మా సినిమా చూశాక అలాంటి అనుభూతి కలుగుతుంది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్