Magazines

అప్పుడు రాముడు.. ఇప్పుడు దశరథుడు

5 గంటల క్రితం

Dasharatha
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 07, 2026 | 1 నిమిషాల చదవడం

‘రామాయణ’ మేకర్స్ అరుణ్ గోవిల్ దశరథుడిగా నటిస్తున్న ప్రత్యేక సోలో పోస్టర్‌ను విడుదల చేశారు. ‘రామాయణ్‌’ సిరీయల్‌లో రాముడి పాత్రతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న అరుణ్ గోవిల్‌కు ఇది మరో ముఖ్యమైన అధ్యాయంగా నిలవనుంది. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో అరుణ్ గోవిల్ అయోధ్య రాజు దశరథుడి పాత్రలో కనిపిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ ఇతిహాస చిత్రంలో అరుణ్ గోవిల్ లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ ఇతిహాసంతో ఎంతో ప్రత్యేకమైన అనుబంధం ఉన్న నటుడు ఇప్పుడు అదే కథలో మరో కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. మేకర్స్ ఈ కొత్త పోస్టర్‌ను విడుదల చేస్తూ, ఒక తరం కోసం ఆయన రాముడికి ప్రాణం పోశారు. ఇప్పుడు ‘రామాయణ’ ప్రపంచంలోకి అయోధ్య రాజుగా తిరిగి వస్తున్నారు. దశరథుడిగా అరుణ్ గోవిల్.. అంటూ పంచుకున్నారు. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామా యణ’లో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమం తుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు. నమిత్ మల్హోత్రాకు చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డీఎన్‌ఈజీతో కలిసి, యష్‌కు చెందిన మాన్‌స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్‌ భాగస్వామ్యంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘రామాయణ’ తొలి భాగం నవంబర్ 5న విడుదల కానుంది. రెండో భాగం వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్