తూర్పుదిశన భానుడు నవ్వగా
తలవంచి నమస్కరించు సుందరి
పగలంతా రవితోనే సాగుతూ
పసిడికాంతులు విరజిమ్మే నారి,
పొద్దుతిరుగుడు పువ్వై నిలువనా
నీ ప్రేమకై వేచి చూడనా...!
పసిడిపూల రంగులతో
మురిసిపోతుంది ఈ నందనవనం,
ఏ స్వర్ణపుష్పాలకైనా ఆ భానుడి
కిరణమే కదా పరమార్ధం,
నీవు తప్ప అన్యరూపం నా కనులకు చేరదు
నేను పడే ఈ పరితపన ఏ క్షణమూ మారదు.
భానుని ప్రతీ కిరణంతో పొద్దుతిరుగుడు వనం
పులకించి వికసించినట్లు..
పతి నీడను ఆశ్రయించి
సతి హృదయం పరిమళించును....!
ఆయన అనురాగపు వెలుగులో
ఆమె ప్రేమ నిరంతరం వికసించును...!
ప్రతి వేకువ నీ రాకకై ఇలా నిరీక్షిస్తుంటాను,
సూర్యకాంతిని చూడనిదే
పొద్దుతిరుగుడుపువ్వు మనసొప్పనట్టు,
వనమున ప్రతిదిక్కున
ఒకే ప్రణయ సందేశం ప్రతిధ్వనిస్తుంది,
సూర్యముఖి జీవనమంతా
ఆ భానుడికే సొంతమనీ...!
నా జీవిత ప్రాంగణంలో నీవు
పొద్దుపొడిచే తూర్పు సూర్యుడివై వెలుగు,
నీ పవిత్రబంధంలో నేను
సూర్యముఖినై సదా వికసించనా.....!!
- నేహా
పొద్దుతిరుగుడు పువ్వు
51 నిమిషాల క్రితం

balaji
ప్రచురించబడింది అక్టో 04, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)