Magazines

పోలీసింగ్‌కు కొత్త దిశ....భవిష్యత్ ప్రణాళికలు

23 నిమిషాల క్రితం

policing
avatar
balaji

ప్రచురించబడింది నవం 21, 2026 | 1 నిమిషాల చదవడం

మినీ స్టాఫ్ ఆఫీసర్స్‌ సమావేశంలో 
డీజీపీ సి.వి. ఆనంద్

నవతెలంగాణ- ప్రత్యేక ప్రతినిధి

రాష్ట్ర పోలీస్ శాఖలో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, అభివృద్ధి ప్రణాళికలు, సిబ్బంది సంక్షేమంపై డీజీపీ సీవీ. ఆనంద్‌ శుక్రవారం మినీ స్టాఫ్ ఆఫీసర్స్ సమావేశం నిర్వహించి పలు కీలక అంశాలపై చర్చించారు. వచ్చే నెలలో నిర్వహించనున్న పోలీస్ రిట్రీట్‌, మహిళా పోలీస్ అధికారుల సదస్సు, నూతన తెలంగాణ పోలీస్ మాన్యువల్‌ రూపకల్పన పూర్తి చేసి విడుదల చేయడం, పోలీస్ బ్రాస్‌, పైప్ బ్యాండ్లను పునరుద్ధరించడం వంటి అంశాలపై చర్చించారు. రాష్ట్ర స్థాయి డ్యూటీ మీట్ నిర్వహణ, ఆల్ ఇండియా పోలీస్ క్రికెట్ టోర్నమెంట్‌ నిర్వహణపై సమీక్షించారు. రాష్ట్ర పోలీస్ శాఖకు సంబంధించి వార్షిక శిక్షణ క్యాలెండర్‌ సిద్ధం చేయడం, రెండు వేల మంది హోంగార్డుల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్‌, ఇతర వివరాలు, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా తెలంగాణ పోలీస్ శాఖ మంజూరైన సిబ్బంది సంఖ్యను పునఃసమీక్షించడం వంటి అంశాలను పరిశీలించారు. రిటైర్డ్ పోలీస్ అధికారుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సమావేశంలో చర్చించిన ప్రతి అంశానికి సంబంధించి అధికారులకు నిర్దిష్ట బాధ్యతలు అప్పగించడంతోపాటు, పనుల పూర్తికి గడువులు కూడా నిర్ణయించారు. నిర్ణీత సమయంలో లక్ష్యాలను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీజీ విమెన్ సేఫ్టీ వింగ్ డాక్టర్‌ సౌమ్య మిశ్రా, టీజీపీఏ డైరెక్టర్ అభిలాష బిస్తు, ‌డీజీ,ఏసీబీ అండ్‌ ‌సీఐడీ చారు సిన్హా, టీజీఎస్‌పీ ఏడీజీ సంజయ్ కుమార్ జైన్, ఏడీజీ (లా ఆర్డర్‌ ఆర్డర్) డా‌క్టర్‌ అకున్ సబర్వాల్, ఐజీ, పీ అండ్‌ ఎల్ డా‌క్టర్‌ గజరావ్ భూపాల్‌తో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్