Magazines

స్కీం వర్కర్లపై మోయలేనంత పని భారం

1 గంట క్రితం

workload on workers
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 31, 2026 | 2 నిమిషాల చదవడం

శ్రామిక మహిళా సదస్సు సావనీర్‌ అవిష్కరణలో పాలడుగు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల స్కీం వర్కర్లపై మోయలేనంత పని భారం పడుతోందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ ‌ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌‌లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో అఖిల భారత శ్రామిక మహిళా సమన్వయ కమిటీ 13వ జాతీయ సదస్సు సావనీర్ ను శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ ఎస్వీ రమతో కలిసి ఆయన అవిష్కరించారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు ఎం. పద్మశ్రీ, జె. వెంకటేష్, కూరపాటి రమేష్, హైదరాబాద్ సౌత్ జిల్లా కార్యదర్శి ఎం. శ్రావణ్‌‌కుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ. సునీత తదితరులు ఈ కార్య్రకమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించడానికి ప్రభుత్వాలు నిరాకరిస్తున్నాయని తెలిపారు. పని ప్రదేశాల్లో సరైన వసతి సౌకర్యాలు లేనందు వల్ల వారు అనారోగ్యాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పురుషులతో సమానంగా పనిచేసినా వారికి తగిన గౌరవం, వేతనం దక్కడం లేదని చెప్పారు. లైంగిక వేధింపులకు గురవుతున్నారన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ల వల్ల పని గంటలు పెరగడమేగాక రాత్రి పూట కూడా పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఈ సమస్యలన్నింటినీ ఎదుర్కొనేందుకు అన్ని రంగాల్లోని శ్రామిక మహిళలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఎస్వీ రమ మాట్లాడుతూ ఇటీవల అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరిగిందని గుర్తు చేశారు. దేశ, రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తిలో వారి శ్రమ శక్తి కూడా ఇమిడి ఉందన్నారు. అయినప్పటికీ మహిళల శ్రమకు సరైన గుర్తింపు లేదని, ఇది వారి పట్ల వివక్ష కాదా అని ప్రశ్నించారు. దేశంలోని మహిళా కార్మికుల్లో కేవలం 6 శాతం మంది మాత్రమే సమాన పనికి సమాన వేతనం, ప్రసూతి సెలవు మొదలైన చట్టపరమైన హక్కులు పొందుతున్నారన్నారు. జాతీయ సదస్సులో తీసుకున్న నిర్ణయాల అమలుకు రాష్ట్ర కమిటీ కృషి చేస్తుందన్నారు.

​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్