అంతరాయం లేని విమాన రాకపోకలు
ప్రత్యేక లైట్లు ఏర్పాటు చేసిన సంస్థ యాజమాన్యం
నవతెలంగాణ-శంషాబాద్
పొగ మంచు కారణంగా విమాన రాకపోకలు ఆలస్యం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నామని హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సీఈఓ కధీర్ కధీరవన్ మంగళవారం ఒక ప్రకటనలో ప్రకటించారు. విమాన రహదారిపై పొగమంచులో సరైన విధంగా వెలుతురు ఉండే చర్యల్లో భాగంగా విమానాశ్రయంలో క్యాట్-III సామర్థ్యంతో రన్‌వే కార్యకలాపాలను తీర్చిదిద్దామని తెలిపారు. ఇందుకోసం ఎయిర్‌ఫీల్డ్ గ్రౌండ్ లైటింగ్ (ఏజీఎల్) సామర్థ్యాన్ని విజయవంతంగా అందుబాటులోకి తీసుకొచ్చా మన్నారు. విమానాల రాకపోకలకు సంబంధించిన ప్రదేశం అత్యంత తక్కువ దృశ్యం కనిపించే పరిస్థితుల్లోనూ నిర్వహించడం సాధ్యమవుతుందని పేర్కొ న్నారు. శీతాకాలంలో పొగమంచు కారణంగా విమానాల దారి మళ్లింపులు, ఆలస్యాలను తగ్గించడంతో పాటు ప్రయాణికులకు ఏర్పాట్లు చేశామని తెలిపారు.





కామెంట్‌లు (0)