Magazines

అండాల అక్రమ సేకరణ దందాపై సర్కారు ఉక్కుపాదం

13 నిమిషాల క్రితం

Government cracks down on illegal egg collection racket
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026 | 2 నిమిషాల చదవడం

రాష్ట్రవ్యాప్తంగా 27 ఏఆర్టీ కేంద్రాల్లో తనిఖీలు

7 ఆస్పత్రుల్లో 13 నిబంధనల ఉల్లంఘనలు

షోకాజ్‌ నోటీసులు జారీ

31 మంది మహిళల గుర్తింపు

వైద్యులు, ఐవీఎఫ్‌ కేంద్రాలు, మధ్యవర్తుల పాత్రపై విచారణ

నవతెలంగాణ - సిటీబ్యూరో

అండాల సేకరణ ముసుగులో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి, నిబంధన లకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న సంస్థలు, వ్యక్తులపై వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ గ్రూప్స్ రాష్ట్రవ్యాప్తంగా ఐవీఎఫ్‌ కేంద్రా లపై ముమ్మర తనిఖీలు చేపడుతున్నాయి. రాష్ట్రంలో గుర్తించిన మొత్తం 44ఏఆర్టీ కేంద్రాలకు గాను ఇప్పటివరకు 27 కేంద్రాల్లో వైద్య అధికా రులు తనిఖీలు పూర్తి చేశారు. ఈ తనిఖీల్లో 7 ఆస్పత్రుల్లో 13 నిబంధనల ఉల్లంఘ నలను గుర్తించారు. ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలకు ఇప్పటికే షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. మిగిలిన కేంద్రాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. పోలీసుల స్వాధీ నంలో ఉన్న రికార్డులు, జాతీయ ఏఆర్టీ అండ్‌ సరోగసీ రిజిస్ట్రీ నుంచి అందే వివరాలను పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలు చేపట్టనున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి పలువురు మహిళలను గుర్తించగా, వైద్యులు, ఐవీఎఫ్‌ కేంద్రాలు, మధ్యవర్తుల పాత్రపై విచారణ కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై మరింత లోతుగా విచారణ జరిపేం దుకు ఈ నెల 6న వైద్య అధికారులు న్యూఢిల్లీలోని నేషనల్‌ ఏఆర్టీ అండ్‌ సరోగసీ రిజిస్ట్రీని సందర్శించారు.

తెలంగాణలో నమోదైన ఏఆర్టీ కేంద్రాలు, ఏఆర్టీ బ్యాంకులకు సంబంధిం చిన పూర్తి వివరాలను కోరారు. అసిస్టెడ్‌ రిప్రొడక్టివ్‌ టెక్నాలజీ (రెగ్యు లేషన్‌)చట్టం–2021, దాని నిబంధనలకు విరుద్ధంగా మహిళల నుంచి అండాలను సేకరిం చడం శిక్షార్హమైన నేరమని వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరిం చింది. రాష్ట్రంలోని అన్ని ఏఆర్టీ క్లినిక్‌లు, ఏఆర్టీ బ్యాంకులు తప్పనిసరిగా చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్‌ పొందడంతోపాటు నిర్దేశించిన నిబంధనలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. మధ్య వర్తుల మాయమాటలు, ఆర్థిక ప్రలోభాలకు లోనై అక్రమ వైద్య విధానాలకు మహిళలు బలికావద్దని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. ఇలాంటి అక్రమ కార్యకలాపాలను ఎక్కడైనా గుర్తిస్తే సంబంధిత జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్