Magazines

మరో రెండేండ్లలో రెండు లక్షల ఇండ్లు

11 నిమిషాల క్రితం

next two years
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026 | 2 నిమిషాల చదవడం

రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి వివేక వెంకట్ స్వామి

రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ

19న సిద్దిపేటలో ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం

నవతెలంగాణ-సిద్ధిపేట

రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల ఇండ్లను నిరుపేద లకు ఇచ్చామని, ప్రభుత్వం రానున్న రెండేండ్లలో మరో 2 లక్షల ఇండ్లను అందిస్తుందని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన ,గనుల శాఖ మంత్రి వివేక వెంకట్ స్వామి తెలిపారు. మంగళవారం మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ కె.హైమావతితో కలిసి సిద్దిపేట పట్టణంలోని వివిధ వార్డుల్లో సీసీరోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. అనంతరం కొండ భూదేవి గార్డెన్స్ లో సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని సిద్దిపేట మున్సిపాలిటీ, సిద్దిపేట అర్బన్, సిద్దిపేటరూరల్, చిన్నకోడూరు, నారాయణ రావుపేట, నంగునూర్ మండలాలకు చెందిన లబ్దిదారులకు 1121ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 19న రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి సిద్దిపేటలో ఇందిరమ్మ బీమా కార్యక్రమాన్ని ప్రారంభిస్తార న్నారు. రాష్ట్ర ప్రజలందరి మేలుకోసం ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటును ప్రభుత్వం అందిస్తుందని ఈ పథకం ద్వారా ఒక్కొలబ్దిదారులు నెలకు రూ.1200 లబ్ధి పొందుతున్నారన్నారు. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం కార్యక్రమంలో ద్వారా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.9,000 కోట్లను ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించిందన్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని 10 లక్షలకు పెంచడం ద్వారా నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించడం జరుగుతుందన్నారు. ఎల్ ఓ సీలు ఇప్పించడం, సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల కోట్ల రూపాయల చెక్కులను అందించడం జరిగిందన్నారు. నిరుపేదలకు సొంతింటి కలను సహకారం చేసేందుకు ఇప్పటివరకు సిద్దిపేట నియోజకవర్గంలో 5500 ఇందిరమ్మ ఇండ్లను నిరుపేదలకు మంజూరు చేశామన్నారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాలులేక రానున్న రోజులలో మంచినీటికి కొరత ఏర్పడనున్నందున ప్రజలకు ఇబ్బంది కలగకుండా అందుబాటులో ఉన్న నీటి వనరులను ఉపయోగించడం పై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నీటిని పొదుపుగా వాడాలని ఇప్పుడు జాగ్రత్త పడక పోతే మే, జూన్ మాసాలలో తీవ్ర నీటి ఎద్దడి తలెత్తుతుదని అన్నారు. అమృత్ పథకం సిద్దిపేట లో ప్రారంభం అవుతుందని ఆ పథకం ద్వారా సిద్ధిపేట పట్టణంలో ఇంటింటికి తాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. సీఎం ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రారంభిస్తారని, ఈ పథకం ద్వారా 1 కోటి మందికి 5 లక్షల రూపాయల వరకు బీమా సౌకర్యం కలుగుతుందని అన్నారు. జిల్లాలో నూతనంగా 15 వేల కొత్త రేషన్ కార్డ్ లను ఇచ్చామన్నారు. 45 వేలమంకిది అదనంగా లబ్ది చేకూరిందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కే.హైమావతి మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం అనేక పథకాలను తీసుకువచ్చిందని, ఈ పథకాలను ఉపయోగించుకొని ప్రతి ఒక్క పేద కుటుంబం అభివృద్ధి చెందాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మెన్‌ గూడూరి శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చై‌ర్మెన్‌ దరిపెల్లి చంద్రం, ఆత్మ చై‌ర్మెన్‌ పూజల గోపికృష్ణ, ఆర్టీఏ మెంబర్ సూర్య వర్మ, నియోజకవర్గ ఇన్‌‌చార్జి హరికృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మెన్‌ లు దేవులపల్లి యాదగిరి, మీసం మహేందర్, సిద్దిపేట ఆ‌ర్డీఓ సదానందం, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్