Magazines

గొర్రెలు కడిగేందుకు వెళ్లి...

1 గంట క్రితం

sheep
avatar
balaji

ప్రచురించబడింది నవం 03, 2026 | 1 నిమిషాల చదవడం

ఒకరిని కాపాడబోయి మరొకరు

మైనింగ్ గుంతలో పడి ఇద్దరు మృతి

వికారాబాద్‌ ‌జిల్లా ధరూర్‌ మండలంలో ఘటన


నవతెలంగాణ-ధారూర్
గొర్రెలను కడిగేందుకు మైనింగ్‌ ‌గుంత వద్దకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ఒకరిని కాపాడబోయి మరొకరు నీటమునిగి మృతి చెందారు. ఈ విషాద ఘటన వికారాబాద్‌ జిల్లా ధారూర్ మండలం తరిగోపుల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తరిగోపుల గ్రామానికి చెందిన శ్రీనివాస్ (43), అశోక్ (21) గొర్రెలను

మేపుతూ వాటిని కడిగేందుకు మైనింగ్‌ ‌గుంత వద్దకు వెళ్లారు. గొర్రెలను కడుగుతుండగా మైనింగ్ తవ్వకాల వల్ల ఏర్పడిన గుంతలో ప్రమాదవశాత్తు ఒకరు చిక్కుకున్నారు. అతన్ని రక్షించేందుకు మరో వ్యక్తి ప్రయత్నించడంతో ఇద్దరూ నీటమునిగి మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీశారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే లావణ్ణి పట్టా భూముల్లో సంబంధిత అధికారుల అనుమతులతో మైనింగ్ కార్యకలాపాలు కొనసాగుతున్నట్టు స్థానికులు తెలిపారు. మైనింగ్‌కు అనుమతులు ఇచ్చే సమయంలోనే భద్రతా నిబంధనలు, తవ్వకాల నిర్వహణ, తవ్వకాలు పూర్తయిన తర్వాత గుంతల పూడ్చివేత వంటి అంశాలను అధికారులు పర్యవేక్షించకుండా వదిలివేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. అనుమతులు ఇవ్వడం వరకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో నిరంతరం తనిఖీలు నిర్వహించాల్సిన బాధ్యత సంబంధిత శాఖలపై ఉందన్నారు. అలాగే బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్