Magazines

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో పలుచోట్ల భారీ వర్షం

1 గంట క్రితం

Heavy rain in several parts of the Greater Hyderabad area
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 31, 2026 | 1 నిమిషాల చదవడం

మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కీసరలో 11 సెంటీమీటర్ల వర్షపాతం

జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 171 చోట్ల వాన

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌పరిధిలో శుక్రవారం రాత్రి సమయంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మేడ్చల్‌ ‌మల్కాజిగిరి జిల్లా కీసరలో అత్యధికంగా 11.18 సెంటీమీటర్ల భారీ వర్షం పడింది. శుక్రవారం రాత్రి 10 :30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 243 ప్రాంతాల్లో వర్షపాతం నమోదుకాగా అందులో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 171 ప్రాంతాలున్నాయి. గ్రేటర్‌ ‌హైదరాబాద్‌‌లో సాయంత్రం పూట ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. సాయంత్రం, రాత్రి సమయాల్లో పలు చోట్ల భారీ వర్షం పడింది. రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు కూడా పలు జిల్లాల్లో అక్కడక్కడా వర్షం కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి స్టెల్లా తెలిపారు. శనివారం నాడు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ ‌మల్కాజిగిరి ‌జిల్లాలకు వర్ష సూచన ఉండటంతో ఎల్లో హెచ్చరిక జారీ చేశారు. ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని తెలిపారు.

అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలు

కీసర (మేడ్చల్‌ ‌మల్కాజిగిరి)11.18 సెంటీమీటర్లు

నార్కట్‌‌పల్లి (నల్లగొండ)9 సెంటీమీటర్లు

వర్కట్‌‌పల్లి(యాదాద్రి భువనగిరి)8.9 సెంటీమీటర్లు

వెంకిర్యాల(యాదాద్రి భువనగిరి)8.4 సెంటీమీటర్లు

బహదూర్‌‌పుర(హైదరాబాద్‌)8.23 సెంటీమీటర్లు

ఎల్లంకి(యాదాద్రి భువనగిరి)7.5 సెంటీమీటర్లు

మాదాపూర్‌(‌రంగారెడ్డి)7.35 సెంటీమీటర్లు

తొర్రూర్‌(‌రంగారెడ్డి)7.13 సెంటీమీటర్లు


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్