రాజస్థాన్‌లో రైతు ఉద్యమాల చరిత్ర స్ఫూర్తిదాయకం: కిసాన్ సభ రాజస్థాన్ నాయకులు ఛగన్‌లాల్ చౌదరి
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ
ప్రతినిధి(ఎమ్‌డీ సాదత్ అలీ)
వ్యవసాయం చేస్తున్న రైతుల అందరి పరిస్థితి ఒక్కటే.. పంటలకు గిట్టుబాటు ధరలేక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని కిసాన్ సభ రాజస్థాన్ నాయకులు ఛగన్‌లాల్ చౌదరి అన్నారు. రాజస్థాన్‌లో రైతుల పరిస్థితులు, ఎదుర్కొంటున్న సమస్యలు, కిసాన్ సభ ఆధ్వర్యంలో సాగిన చారిత్రక పోరాటాల గురించి వివరించారు. రైతులపై అప్పుల భారం పెరుగుతున్నదని, వ్యవసాయం నష్టదాయకంగా మారడం తో పిల్లలు సైతం సాగు పట్ల ఆసక్తి చూపడం లేదని తెలిపారు. రాజస్థాన్‌లో భౌగోళిక పరిస్థితుల ఆధారంగా రైతులు నాలుగు రకాలుగా సాగులో ఉన్నారని వివరించారు. మూడు, నాలుగు జిల్లాల్లో మాత్రమే కాలువల ద్వారా సాగునీరు అందుతోందని, మరో ఎనిమిది నుంచి పది జిల్లాల్లో బోరుబావుల ఆధారంగా వ్యవసాయం జరుగుతుం దని తెలిపారు. మిగిలిన ప్రాంతాల్లో పూర్తిగా వర్షాధార సాగు ఉంటుందని, మరోవైపు ఆదివాసీ ప్రాంతాల రైతులు ప్రత్యేక సమస్యలను ఎదుర్కొంటున్నారని చెప్పారు.
విద్యుత్ రాయితీ పోరాటం చారిత్రాత్మక మని అన్నారు. 2005లో వ్యవసాయ విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం రాజస్థాన్ రైతాంగ చరిత్రలో కీలకమైందని ఛగన్‌లాల్ చౌదరి చెప్పారు. సెప్టెంబర్ 1 నుంచి 8వ తేదీ వరకు సుమారు లక్ష మంది రైతులు జైపూర్‌లోని ముఖ్యమంత్రి నివాసం వద్ద పగలు, రాత్రి అక్కడే నిరసన తెలిపారన్నారు. ఈ పోరాటం అనంతరం కుదిరిన ఒప్పందం ప్రకారం విద్యుత్ చార్జీల పెంపు భారాన్ని ప్రభుత్వం భరించాలని, రైతులు పాత ధరలనే చెల్లించాలని నిర్ణయించినట్టు వివరించారు.ఇది రైతు సంఘం పోరాటం సాధించిన ఫలితమన్నారు.రైతులపై రూ.10 నుంచి 20 లక్షల అప్పు భారం ఉందన్నారు.రుణమాఫీ, పంట బీమా కోసం ఉద్యమాలు చేస్తుమన్నారు.




కామెంట్‌లు (0)