Magazines

ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం

14 గంటల క్రితం

Another gold for India at the Asian Games
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ :ఆసియా క్రీడల్లో 14వ రోజు భారత్‌కు అదిరే ఆరంభం లభించింది. రికర్వ్‌ ఆర్చరీలో కుంకుమ్‌ మహోద్‌ స్వర్ణం సాధించిన అనంతరం.. గోల్ఫ్‌లోనూ భారత్‌కు పసిడి దక్కింది. మహిళల వ్యక్తిగత గోల్ఫ్‌ విభాగంలో ప్రణవి శరత్‌ స్వర్ణ పతకం సాధించారు. ఫైనల్లో సింగపూర్‌, చైనా క్రీడాకారిణులను వెనక్కినెట్టి ఆమె ఈ ఘనత సాధించారు. దీంతో మహిళల గోల్ఫ్‌లో ఆసియా క్రీడల చరిత్రలో భారత్‌కు తొలి వ్యక్తిగత స్వర్ణం లభించింది.

మహిళల జట్టు విభాగంలోనూ భారత్‌కు రజతం దక్కింది. ప్రణవి శరత్‌, అదితి అశోక్‌, దీక్షా దాగర్‌లతో కూడిన భారత జట్టు రెండో స్థానంలో నిలిచింది. తాజా విజయంతో ప్రణవి ఈ క్రీడల్లో స్వర్ణం, రజతంతో రెండు పతకాలు సాధించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్