Magazines

లోక్‌సభ, అసెంబ్లీలను రద్దు చేయాలి: ఖర్గే

6 గంటల క్రితం

Kharge
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: దేశంలో జరిగిన అన్ని ఎన్నికలు బూటకమని, ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా అక్రమమేనంటూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ కర్ణాటకలోని కలబురగిలో జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. లోక్‌సభతో పాటు వివిధ రాష్ట్రాల శాసనసభలను రద్దు చేసి, బ్యాలెట్ పేపర్ల ద్వారా కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

దేశంలో ప్రస్తుతం జరుగుతున్న పాలన అంతా అక్రమ ఎన్నికల మీదే ఆధారపడి ఉందని మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. మోడీ అక్రమ ప్రధాని అని, అమిత్ షా అక్రమ మంత్రి అని, అలాగే దేశవ్యాప్తంగా ఎన్నికైన ముఖ్యమంత్రులందరూ అక్రమంగానే ఆ పదవుల్లో ఉన్నారని ఆరోపించారు. ప్రస్తుత ఎన్నికల ప్రక్రియలో వ్యక్తమవుతున్న ఆందోళనల నేపథ్యంలో.. ఉన్న ప్రభుత్వాలను, అసెంబ్లీలను రద్దు చేసి, పూర్తిగా బ్యాలెట్ పేపర్ల విధానంలోనే తాజా ఎన్నికలు జరపాలని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్