నవతెలంగాణ-హైదరాబాద్: పంజాబ్లో డ్రగ్స్కు వ్యతిరేకంగా పోరాడుతున్న పర్వీందర్ సింగ్ జోటాపై ఓ మెడికల్ షాపు యజమాని అశ్విన్ కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. డ్రగ్స్ అమ్మకంపై ప్రశ్నించినందుకు దుకాణదారుడు కాల్పులు జరపడంతో పర్వీందర్ సింగ్ అక్కడికక్కడే మృతిచెందాడు. తాజాగా నిందితుడైన అశ్విన్ దుకాణానికి మృతుని మద్దతుదారులు నిప్పుపెట్టారు. శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ఈ ఉద్రిక్తతల మధ్యే అక్రమ నిర్మాణాలంటూ ఆరోపణలు వస్తున్న నిందితుడి ఇంటిని అధికారులు నేలమట్టం చేశారు. సంఘటన జరిగిన వెంటనే పంజాబ్ నుంచి పరారైన ప్రధాన నిందితుడు అశ్విన్ని పోలీసులు గాలించి, రాజస్థాన్లోని చూరు ప్రాంతంలో ఇవాళ (బుధవారం) ఉదయం అరెస్టు చేశారు.
పర్వీందర్ సింగ్ హత్య.. నిందితుడి దుకాణానికి నిప్పు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 14, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)