నవతెలం-గాణ హైదరాబాద్: టాలీవుడ్ హీరో నితిన్ నటిస్తున్న కొత్త సినిమా ‘అలియాస్ రుక్మిణి’ విడుదల తేదీ ఖరారైంది. దర్శకుడు మురళీ కాంత్ దేవసోత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ‘యునానిమస్ ప్రొడక్షన్స్’ శుక్రవారం ప్రకటించింది. అయితే సినిమాలో రుక్మిణి ఎవరు? అనే ప్రశ్నకు అక్టోబర్ 13న సమాధానం చెబుతామని మేకర్స్ ఆసక్తి పెంచారు. ఈ సినిమాను ప్రముఖ హీరో నాని సమర్పిస్తున్నారు. దీప్తి గంటా నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్‌తో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.
నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ రిలీజ్ డేట్ ఫిక్స్
15 గంటల క్రితం

Shiva Kumar
ప్రచురించబడింది అక్టో 09, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)