Magazines

ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

01 అక్టోబర్, 2026

Setback for Ilayaraja in the Supreme Court
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ''మూడు పాని'' చిత్రంలోని ''ఎన్ ఇనియ పొన్ నిలవే'' పాట కాపీరైట్‌ వివాదంపై  ఇళయరాజా అప్పీల్‌ చేయగా సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈవిషయంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోలేమని జస్టిస్ జె.బి.పార్దివాలా, జస్టిస్ కె.వినోద్ చంద్రన్‌ల ధర్మాసనం తేల్చిచెప్పింది. పాటలోని కేవలం సంగీతంపై మాత్రమే ఇళయరాజాకు హక్కు ఉంటుందని, సాహిత్యం, సౌండ్ రికార్డింగ్‌పై కాపీరైట్ హక్కులు ఆయనకు చెందవని పునరుద్ఘాటించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్