నవతెలంగాణ - హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా హాజరు నమోదు చేయని 68 మంది టీచర్లకు డీఈవో వెంకటేశ్వర్లు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గత నెలలో ఎఫ్‌ఆర్‌ఎస్‌లో హాజరు ఎందుకు నమోదు చేయలేదో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. స్కూల్స్‌లో టీచర్లు సమయానికి హాజరయ్యేలా చూడటానికి ఎఫ్ఆర్ఎస్ అమలు చేస్తున్నామని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
68 మంది టీచర్లకు షోకాజ్ నోటీసులు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 06, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)