నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్ లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. పోలీస్ సబ్-ఇన్స్పెక్టర్ (SI) మెయిన్స్ పరీక్ష రద్దు నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఉద్యోగార్థులు డిమాండ్ చేశారు. సోమవారం వందలాది మంది ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి అధికారిక నివాసం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. శారీరక సామర్థ్య పరీక్ష (physical test) తేదీలను ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.
గత 10 రోజులుగా గార్దనిబాగ్ నిరసన ప్రదేశంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ఈ అభ్యర్థులు, తమ సమస్యల పట్ల యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ రోడ్లపైకి వచ్చారు. 1,799 సబ్-ఇన్స్పెక్టర్ పోస్టుల కోసం జనవరిలో ప్రిలిమినరీ పరీక్షలు, మే 28న మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన తర్వాత, గత నాలుగు నెలలుగా తాము కఠినమైన శారీరక శిక్షణ పొందుతున్నామని నిరసనకారులు తెలిపారు. అయితే, శారీరక సామర్థ్య పరీక్ష (PET) జరగడానికి కొద్ది రోజుల ముందు, "అనివార్య కారణాల"ను సాకుగా చూపి అధికారులు ఆ పరీక్షను హఠాత్తుగా రద్దు చేశారు.







కామెంట్లు (0)